గోదావరి, ప్రాణహిత, పెన్ గంగ నదులపై తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మేడిగడ్డ ప్రాజెక్టు సహా మరో నాలుగు ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు అయిదు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నానికే ముంబై చేరుకున్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేడు సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో భేటీ అయ్యి, అప్పటికే అధికారులు రూపొందించిన చారిత్రాత్మక ఒప్పంద పత్రాలపై వారు సంతకాలు చేశారు.
‘సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా చెబుతూ ఉంటారని చంద్రబాబు నాయుడు పేరు తలచుకున్న గుర్తు చేసుకున్న తెలంగాణా సిఎం కేసీఆర్… “వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులను నిర్మించుకోవాల్సి ఉందని, ఈ ఒప్పందాలతో 400 ఏళ్ల నాటి సమస్య పరిష్కారం కానుందని, మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందాల మేరకు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే ఏటా 2 నుంచి 4 వేల టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందన్నారు.



