కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్యంపై కేంద్రంలో కదలిక వచ్చినట్టు ఉంది. ముందు తేలికగా తీసుకున్నా దీక్ష ఇంకా సాగితే ప్రమాదం అని భావించి గవర్నర్ నరసింహన్ ద్వారా పావులు కలుపుతున్నారు. సీఎం చంద్రబాబుకు గవర్నర్ నరసింహన్ ఫోన్ చేసి నేతల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణిస్తోందని సమాచారం వచ్చిందన్న గవర్నర్…. వారి ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. తొందరగా హాస్పిటల్ కు తరలించేలా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. హాస్పిటల్ లో చేర్పిస్తే దీక్ష కొంత పల్చబడుతుందని వారి వ్యూహం కావొచ్చు.
దీనికి ప్రభుత్వం వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం, కడప స్టీల్ ప్లాంట్లు సాధ్యం కావని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసిన సంగతి తెలిసిందే. దీనితో టీడీపీ కేంద్రంపై ఈ విషయంలో పోరాటానికి దిగింది.



