cm-revanth-reddy on benifit show ticket rates

పుష్ప-2 సినిమా కలెక్షన్స్‌ రూ.1,008 కోట్లు దాటిపోతే అదంతా తమకే వచ్చినట్లు అభిమానులు సంతోషిస్తున్నారు. పుష్ప-2 అన్ని రికార్డులు బద్దలు కొట్టేస్తుంటే అభిమానులు పులకించిపోతున్నారు.

జనవరి నెలాఖరు వరకు పుష్పరాజ్ ఓటీటీలోకి రాడని మైత్రీ చెప్పేసింది. కనుక క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి పండుగ సీజన్‌లో పుష్పరాజ్ అందరి జేబులు ఊడ్చేయడం ఖాయం.

Also Read – సినీ పరిశ్రమలో కొత్త ట్రెండ్స్…. భయపెడుతున్నాయి!

గ్యారెంటీగా మరో 500 లేదా 1,000 కోట్లు పట్టుకుపోతాడు. పుష్పరాజ్ అలా పట్టుకుపోతుంటే ఎవరూ బాధపడటం లేదు. సంతోషిస్తూ టపాకాయలు కాల్చి మిటాయిలు కూడా పంచుకుంటున్నాము.

అయితే పుష్పరాజ్ ఎవరూ ఊహించని ఓ కొత్త ఇబ్బంది కూడా తెచ్చి పెట్టాడు. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందగా, ఆమె 13 ఏళ్ళ కుమారుడు శ్రీతేజ్ నేటికీ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రస్తావిస్తూ, “మీరు చక్కగా సినిమాలు తీసుకోండి. ప్రదర్శించుకోండి, సినిమాలతో బాగా సంపాదించుకోండి. ప్రభుత్వం కూడా మీరు కోరిన ప్రోత్సాహకాలు ఇస్తుంది. మీకు అన్ని విదాల సహాయ సహకారాలు అందిస్తుంది. కానీ మీ సినిమాల కోసం ఎవరూ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఉండకూడదు.

Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!

సంధ్య థియేటర్‌ వద్ద జరగకూడనిదే జరిగింది. ఆ కుటుంబానికి కలిగిన నష్టాన్ని, శోకాన్ని ఎంత డబ్బు ఇచ్చినా తీర్చలేము. కనుక ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి బెనిఫిట్ షోలు, ప్రివిలేజ్ షోలు ప్రదర్శించుకుంటామంటే కుదరదు. నేను ఈ సిఎం కుర్చీలో ఉన్నంతకాలం ఇకపై ఏ సినిమాకి ప్రివిలేజ్ షోలను అనుమతించే ప్రసక్తే లేదు,” అని బాంబు పేల్చారు.

పుష్ప-2 ప్రివిలేజ్ షోకి మొట్ట మొదట రేవంత్ ప్రభుత్వమే అనుమతించింది. ఆ రెండు షోలకు టికెట్ ధరపై అదనంగా రూ.800 పెంచి వసూలు చేసుకునేందుకు అనుమతించింది కూడా. కానీ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన విషాద ఘటన రేవంత్ రెడ్డి ఆలోచననే పూర్తిగా మార్చేసింది.

Also Read – కౌశిక్ రెడ్డి…పార్టీ కోసమా..? పేరు కోసమా.?

దీంతో త్వరలో విడుదలవబోతున్న గేమ్ చేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం, డాకూ మహరాజ్, రాజాసాబ్, విశ్వంభర వంటి పెద్ద సినిమాలన్నీ నష్టపోబోతున్నాయి.

పెద్ద సినిమాలకు అనుమతి ఇచ్చి ఈవిదంగా విమర్శల పాలవడం కంటే అనుమతించకపోవడమే మంచిదని ఏపీ ప్రభుత్వం కూడా అనుకున్నా ఆశ్చర్యం లేదు. కనుక పుష్పరాజ్ వచ్చి మొత్తం గేమ్ చేంజ్‌ చేసేశాడన్న మాట