
భారత్-పాక్ మద్య జరుగుతున్న యుద్ధంలో చైనా, టర్కీ తయారు చేసి ఇచ్చిన క్షిపణులు, డ్రోన్లను పాకిస్థాన్ భారత్‌పై ప్రయోగిస్తోంది. కానీ అత్యాధునికమైన ఆయుధాలనుకున్న ఫతే-2 వంటి క్షిపణులు సైతం వాటన్నిటినీ భారత్ అలవోకగా ధ్వంసం చేస్తుండటంతో అవన్నీ దీపావళి టపాకాయలుగా మిగిలిపోయాయి.
అదే సమయంలో భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఆకాశ్ వంటి క్షిపణులు, రష్యా సహకారంతో తయారుచేసుకున్న సూపర్ సోనిక్ బ్రహ్మోస్ వంటి భయంకరమైన క్షిపణులు తిరుగు లేదనిపించుకున్నాయి.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
పాక్ సైనిక, వైమానిక స్థావరాలపై తిరుగులేని బ్రహ్మాస్త్రం వంటి బ్రహ్మోస్ క్షిపణితో దాడి చేయడంతో, ఆ ఒక్క దెబ్బకు పాక్ సైన్యాధికారులు సైతం హడలిపోయారు.
తాము పంపుతున్న యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఫతే2 వంటి భయంకరమైన క్షిపణులు, భారత్‌లో ఒక్క లక్ష్యం కూడా చెందించలేకపోతుంటే, భారత్ వాయుసేన పాక్ భూభాగంలో ప్రవేశించి మరీ దాడులు చేయగలుగుతుండటం పాక్ ప్రజలు కూడా జీర్ణించుకోవడం కష్టమే.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
ట్రంప్ సూచన మేరకు కాల్పుల విరమణతో పాక్ సైన్యానికి కాస్త ఊపిరి పీల్చుకొని ఆలోచించేందుకు సమయం లభించింది. కానీ భారత్‌పై పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్ సైన్యాధికారులు ఈ అవకాశాన్ని గుర్తించలేక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్‌పై దాడులు జరుపుతున్నారు.
భారత్ త్రివిధ దళాలు, ముఖ్యంగా వాయుసేన శక్తి సామర్ధ్యాలు, భారత్ ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ కళ్ళారా చూసిన తర్వాత కూడా మళ్ళీ భారత్‌పై దాడి చేయడం అంటే ఆత్మహత్యతో సమానమే అని చెప్పవచ్చు.
Also Read – వైసీపీ..ఒక “అందమైన” కుటుంబం..
ఓ పక్క భారత్-పాక్ మద్య యుద్ధం జరుగుతుంటే, లక్నోలో యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాధ్ నేడు వర్చువల్‌గా ప్రారంభించడం విశేషం.
2018 గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధాని మోడీ లక్నోలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో ‘బ్రహ్మోస్’ క్షిపణులు తయారు చేసే పరిశ్రమకి శంకుస్థాపన చేశారు. దానినే నేడు సిఎం ఆధిత్యనాధ్ ప్రారంభించారు.
ఈ యూనిట్‌లో ఏడాదికి 100 బ్రహ్మోస్ క్షిపణులు, మరో 100-150 వరకు నెక్స్ట్ జనరేషన్ బ్రహ్మోస్ క్షిపణులు తయారవుతాయని సిఎం యోగీ ఆధిత్య నాధ్ చెప్పారు.
ఇటువంటిదే తమిళనాడులో మరో డిఫెన్స్ కారిడార్ దానిలో ఇటువంటి క్షిపణులు, యుద్ధ విమానాలకు అవసరమైన పరికరాలను తయారవుతాయి. భారత్ క్షిపణులు, యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు తయారీలో విదేశీ సాంకేతిక సహకారం తీసుకుంటున్నా దేశంలోనే తయారుచేసుకోవడం బాగా కలిసివచ్చిందని ఈ 5 రోజుల యుద్ధంతో స్పష్టమైంది. భారత్ వద్ద ఒకటో రెండో కాదు కొన్ని వందల బ్రహ్మోస్ అస్త్రాలు సిద్దంగా ఉన్నాయనే విషయం కూడా యోగీ ఆదిత్యనాధ్ మాటలతో బయటపడింది.