Congress Mark Politics on Operation Sindoor

పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్‌ చేపట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీతో సహా దేశంలో అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపాయి.

దాంతో ప్రధాని మోడీ పేరు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోతుందని, ప్రజలు బీజేపివైపు మొగ్గుచూపుతారని కాంగ్రెస్‌, మిత్ర పక్షాలకు తెలుసు. కానీ దేశ భద్రత కోసం మోడీ ప్రభుత్వం పాక్‌తో యుద్ధం చేస్తున్నప్పుడు సంఘీభావం తెలుపకపోతే, తమ పార్టీల పట్ల దేశ ప్రజలలో వ్యతిరేకత పేరుగుతుందనే భయం ఉంది కనుకనే ఆపరేషన్ సింధూర్‌కి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని భావించవచ్చు.

Also Read – కుదిరితే యుద్ధం.. ప్రమాదం ముంచుకొస్తే విలీనం?

ఆపరేషన్ సింధూర్‌ హడావుడి ముగిసిపోయి ఇప్పుడు దేశంలో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి కనుక కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశంపై రాజకీయాలు చేయడం మొదలుపెట్టింది.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాడు ఇందిరా గాంధీ పాకిస్థాన్‌తో యుద్ధం చేసి ఓడించి, బంగ్లాదేశ్ ఏర్పాటు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చినా ప్రధాని మోడీ ధైర్యంగా యుద్ధం చేసి పాక్‌కి గట్టిగా బుద్ది చెప్పలేకపోయారు. పాక్‌తో యుద్ధం మొదలుపెట్టి ఏమీ సాదించకుండానే ఆ దేశంతో రాజీ పడ్డారు,” అని విమర్శించారు.

Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!

ఆపరేషన్ సింధూర్‌ కేవలం ఉగ్రవాదుల స్థావరాలు నాశనం చేయడానికే తప్ప పాకిస్థాన్‌తో యుద్ధం కోసం కాదని భారత్‌ మొదటి నుంచి చెపుతూనే ఉంది. అదే చేసింది కూడా.

కానీ పాక్‌ మన సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేసినందున, భారత్‌ కూడా పాక్‌ మన సైనిక, వైమానిక స్థావరాలపై దాడులు చేసి పాక్‌ని చావు దెబ్బ తీసి, భారత్‌ ఆయుధ సత్తా, టెక్నాలజీ, మేదస్సుని యావత్ లోకం గుర్తించేలా చేసింది.

Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?

ఆపరేషన్ సింధూర్‌ ముగిసిన తర్వాత మన సైనికులకు కృతజ్ఞతలు తెలుపుకునే పేరుతో బీజేపి, మిత్ర పక్షాలు దేశవ్యాప్తంగా ‘తిరంగా ర్యాలీ’లు నిర్వహించింది.

వాటితో బీజేపి ఆపరేషన్ సింధూర్‌ క్రెడిట్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోందని భావించిన కాంగ్రెస్ పార్టీ, తాము మద్దతు ఇచ్చినా మోడీ ప్రభుత్వం పాక్‌తో యుద్ధం చేయలేక చేతులెత్తేసిందని ప్రచారం చేసుకుంటూ క్రెడిట్ కోసం ప్రాకులాడుతోంది.

అయినా కాంగ్రెస్‌ పార్టీ దశాబ్ధాలపాటు దేశాన్ని పాలించింది. పాక్‌ ఉగ్రవాదులు భారత్‌పై దాడులు చేసి వేలాదిమందిని బలి తీసుకుంటుంటే ఏం చేయగలిగింది?కేవలం ఖండన ప్రకటనలు మాత్రమే కదా?

కానీ ప్రధాని మోడీ పహల్గాం దాడికి ప్రతీకారంగా వెంటనే ఆపరేషన్ సింధూర్‌ చేపట్టి పాక్‌ని చావు దెబ్బ తీశారు కదా?

ఒకవేళ ఆపరేషన్ సింధూర్‌ కొనసాగిస్తూ పాక్‌పై క్షిపణులతో దాడులు కొనసాగించి ఉంటే, పాక్‌ తనని తాను రక్షించుకునేందుకు తప్పకుండా భారత్‌పై అణు బాంబులను ప్రయోగించి ఉండేది.

వాటిని భారత్‌ సమర్ధంగా తిప్పి కొట్టినా, కొట్టలేకపోయినా ఆ అణుబాంబుతో విధ్వంసం తప్పదు. పరిస్థితి అంతవరకు రాకూడదనే భారత్‌ సంయమనం పాటించింది. కనుక కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తోందని కేంద్ర ప్రభుత్వం పాక్‌తో యుద్ధం చేసి దేశాన్ని నాశనం చేసుకోదు కదా?