vallabhaneni-vamsi-custody

గత ఐదేళ్ల పాపాలు కేసుల రూపంలో వైసీపీ నేతల చేతులకు చుట్టుకున్నాయి. దీనితో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలు జైలు బాట పట్టారు, అలాగే ఇంకా ఎంతోమంది తమ పాపల ప్రక్షాళనకు జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే తాజాగా కటకటాల వెనక్కెళ్ళిన వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు విషయంలో నేడు అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్టయిన వంశీ, రిమాండ్ రేపటితో ముగియనుండటంతో ఆయన పై పీటీ వారెంట్ ఇష్యూ చేసారు సిఐడి అధికారులు.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని

గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో భాగంగా వంశీ కి పీటీ వారెంట్ జారీ చేసిన అధికారులు ఆ కేసు విషయంలో వంశీ పాత్ర పై విచారణ ముమ్మరం చేయనున్నట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి 13 న వంశీని అరెస్టు చేసిన పోలీసులు 14 రోజుల పాటు రిమాండ్ కోరడంతో అందుకు న్యాయస్థానం అంగీకారం తెలపడం జరిగింది.

ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో ముందస్తు బైలు కోసం ఎస్సి, ఎస్టీ కోర్టులో వంశీ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం, ఆయన్ను 3 రోజుల పాటు పోలీస్ కస్టడీ కి అనుమతినిచ్చింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు విచారించవచ్చునని, అయితే ఈ విచారణ న్యాయవాది సమక్షంలోనే జరగాలంటూ ఆదేశించింది కోర్ట్.

Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్


అయితే విచారణ సమయంలో ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని, అలాగే వంశీ కోరుతున్నట్టుగా ఆయనకు జైల్లో వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలంటూ అధికారులను ఆదేశించింది నయ్యస్థానం. దీనితో అటు వంశీకి ఇటు అధికారులకు న్యాయస్థానం వారి వారి కోరికల మేరకు పోలీస్ కస్టడీ కి, సౌకర్యలకు రెండిటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది.