తమిళ యంగ్ హీరో, సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ తమ కుమారుడే అంటూ కదిరేశన్, మీనాక్షి దంపతులు మధురై కోర్టులో పిటిషన్ వేసిన విషయం పాతదే. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి కోర్టులో ఇప్పటికే పలు మార్లు విచారణ జరిగింది. ధనుష్ చెన్నైలోని స్కూల్లో చదువుకున్న ఆధారాలను, 2002లో ఉద్యోగం కోసం సమర్పించిన ఆధారాలను కదిరేశన్, మీనాక్షి దంపతులు కోర్టుకు అందజేశారు.
మరో వైపు వీరు కోర్టుకు సమర్పించిన టీసీలో ధనుష్ పుట్టు మచ్చల వివరాలు ఉన్నాయి. అయితే ధనుష్ కోర్టుకు సమర్పించిన 10వ తరగతి టీసీలో గుర్తింపు ఆధారాలను పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ లోగా ధనుష్ నేరుగా కోర్టుకు హాజరు కావాలని… పుట్టు మచ్చల వివరాలు ఇవ్వాలని మధురై కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో కేసు మరో టర్నింగ్ తిరిగిందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ADVERTISEMENT
ADVERTISEMENT



