ఈసారి కోర్టుకు చంద్రబాబు… తెలంగాణ టీడీపీకు అనుకోని వరమని అనుకోవాలి

Court rejects chandrababu-- naidu plea2010 లో బాబ్లి ఆందోళన లో ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు కోర్టు ముందు హాజరు కాలేదు. ఒకవేళ కోర్టు అరెస్టుకు ఆదేశిస్తే అమెరికా పర్యటనకు ఇబ్బందని నిపుణుల అభిప్రాయంతో ఆయన వెనక్కు తగ్గినట్టు సమాచారం.

ADVERTISEMENT

[m9ad]

చంద్రబాబు కు ఇచ్చిన వారంట్ ను ఉపసంహరించాలని, ఆయన హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపున లాయర్లు కోరారు. వారి వాదనలు విన్న తర్వాత కోర్టుదానిని తోసిపుచ్చింది. చంద్రబాబుతో పాటు ,మిగిలిన నేతలు కూడా తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.

దీనితో అక్టోబరు 15న కోర్టుకు హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. దీనివల్ల పార్టీకి రాజకీయ మైలేజ్ కూడా రాబోతుండటంతో ఇక ముందుకు వెళ్ళడమే నయమని అనుకుంటున్నారట. నవంబర్ లో గనుక తెలంగాణ ఎన్నికలు జరిగితే అక్టోబరు 15న కోర్టు వాయిదా టీడీపీకి రాజకీయంగా ఉపయోగపడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories