CPI-Narayana-comments-on-Chiranjeevi-Pawan-Kalyanసిపిఐ నారాయణ తెలుగు ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. ఆయన మెగా సోదరులు చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌, సిఎం జగన్మోహన్ రెడ్డిలపై ఈరోజు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రజలను మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణను పక్కనబెట్టి ఈ చిల్లర బేరగాడ్ని చిరంజీవి ని స్టేజి మీదకి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు రాలేదో నాకు తెలీదు కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేది.

పవన్‌ కళ్యాణ్‌ ఓ ల్యాండ్ మైన్ వంటివాడు. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఆయన కూడా అంతే. ఎప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా సిఎం జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం కేంద్రానికి సరండర్ అయిపోయారు. మోడీ కనుసన్నలలో మెలుగుతూ ఎన్డీయే అభ్యర్ధికి బేషరతుగా మద్దతు ప్రకటించారు.

ఏపీలో రాజకీయ పార్టీలు, నాయకుల ఈ బలహీనతలతోనే కేంద్రం ఆడుకొంటోంది. మరోవిదంగా చెప్పాలంటే ఏపీ రాజకీయనాయకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది. జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో నేటికీ గేమ్స్ ఆడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళుకావస్తున్నా రాజధాని లేదనే బాధ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే నేటికీ హైదరాబాద్‌ రాజధాని అన్నట్లు చాలా మంది అక్కడే తిరుగుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది,” అని అన్నారు.