
కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగిపోయిందంటూ తెలంగాణలో అధికార, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. పనిలో పనిగా పరస్పరం విమర్శించుకుంటున్నాయి కూడా.
ఏపీలో వైసీపీ కూడా దావోస్ సదస్సు నుంచి చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి తేలేకపోయారని, కేంద్రంలో చక్రం తిప్పుతున్నారని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకోవడమే కానీ బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి ఒక్క రూపాయి సాధించలేకపోయారని వైసీపీ నేతలు, వారి సొంత మీడియా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
అయితే తాము అధికారంలో ఉన్నప్పుడు దావోస్ సదస్సుకి వెళ్ళి ఏం పీకాము?ఐదేళ్ళ పాలనలో ఢిల్లీకి వెళ్ళి అప్పులు తెచ్చుకోవడమే తప్ప ఏం పీకాము? అని వైసీపీ నేతలు ప్రశ్నించుకోవడం లేదు.
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల గగ్గోలు దేనికంటే బీజేపి ఏం చేసినా వ్యతిరేకించాలి.. తప్పులు వెతికి విమర్శించాలని వారి పార్టీ అనుకుంటుంది. కనుక తమ పార్టీ విధానానికి అనుగుణంగానే వారు బడ్జెట్ పేరుతో కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారని అనుకోవచ్చు.
Also Read – వ్యవస్థలకి జగన్ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!
తెలంగాణకు మోడీ ప్రభుత్వం అన్యాయం చేస్తే బిఆర్ఎస్ పార్టీ మోడీనే విమర్శించాలి కానీ రేవంత్ రెడ్డిని ఎందుకు విమర్శిస్తోందంటే, రాష్ట్రంలో వారికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన శత్రువు కనుక.
అదేవిదంగా ఏపీలో వైసీపీ కూడా కేంద్రాన్ని విమర్శించకుండా సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తోందనుకోవచ్చు.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
అయితే బడ్జెట్‌లో రాష్ట్రాల పేర్లు చదవనంత మాత్రాన్న, రాష్ట్రాలకు ప్రాజెక్టులు, నిధులు ప్రకటించనంత మాత్రాన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోయిందని అనుకోవడానికి లేదు.
ఉదాహరణకు గత బడ్జెట్‌లో పేర్కొనని అనేక ప్రాజెక్టులు, నిధులు కేంద్రం ఏపీకి మంజూరు చేసింది. ఇటీవల ప్రధాని మోడీ విశాఖలో చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలే ఇందుకు ఉదాహరణ.
ఈవిషయం అధికార, ప్రతిపక్షాల నేతలందరికీ బాగా తెలుసు. కానీ వార్వారి పార్టీల పరిస్థితిని బట్టి అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడుతుంటారు. వారే మరో 10-15 రోజుల తర్వాత ఈ బడ్జెట్ ఊసే ఎత్తకుండా వేరే అంశాలపై రాజకీయాలు చేస్తుంటారు.
చంద్రబాబు నాయుడుకి ఇవన్నీ తెలుసు కనుకనే బడ్జెట్ కేటాయింపులపై ఎటువంటి విమర్శలు చేయలేదు. కానీ నేడు ఢిల్లీ వెళుతున్నారు కనుక బడ్జెట్ కేటాయింపుల ప్రకారమే ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మెట్రో లేదా విమానాశ్రయాలో ఏదో ఒకటి సాధించుకునే ప్రయత్నం తప్పక చేస్తారని వేరే చెప్పక్కరలేదు.