చెన్నై కంచుకోట బద్దలైనట్టేనా..?

Chennai Super Kings struggling at Chepauk stadium during IPL matches

ఐపీఎల్ ప్రారంభం నుండి చూస్కుంటే ముంబై, కోల్కతా, హైదరాబాద్ మొదలగు ఎక్కువ శాతం జట్లు సొంత గ్రౌండ్లలో తమ ఆధిపత్యాన్ని చూపటంలో అస్సలు తగ్గలేదు. ఆ జాబితాలో మొదటగా ఉండవలసిన పేరు ‘చెన్నై సూపర్ కింగ్స్’.

అపోజిషన్ తో సంబంధం లేకుండా తమ గ్రౌండ్లో మ్యాచ్ అంటే ఆధిపథ్యం తమదే అనే విధంగా ప్రదర్శించేది ఈ జట్టు. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో చెన్నై చెపాక్ స్టేడియం ఆ జట్టుకు ఒక కంచుకోట లా మారింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై ఇలా జట్టు ఏదైనా తమ కోటలో తమ ముందు వెన్ను చూపాల్సిందే అనే విధంగా ఉండేది అప్పట్లో.

ADVERTISEMENT

కానీ, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ నమ్మకాన్ని వీడకతప్పట్లేదు. తాము చెపాక్ స్టేడియంలో ఆడిన చివరి 6 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకపోవటం అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుత సి.ఎస్.కె జట్టు ఫామ్ చూసి ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ ను ఈ న్యూస్ మరింత కలవరపెడుతుంది.

మ్యాచ్లో అపోజిషన్ పైచెయ్యి సాధించిన ప్రతిసారి చెన్నై జట్టు ఎలాగోలా ఆ జట్టును కిందకు నెట్టేసి మ్యాచ్ను కైవసం చేసుకునేవారు. అందుకే సి.ఎస్.కె ను ‘చెన్నై సూపర్ కింగ్స్’ తో పాటు ‘కమ్-బ్యాక్ సూపర్ కింగ్స్’ అని కూడా పిలుస్తుంటారు. కానీ ప్రస్తుత చెన్నై జట్టు ఫామ్ చూస్తుంటే ఇప్పట్లో కమ్-బ్యాక్ ఇచ్చే సూచనలు కనిపించటంలేదు.

ఈ సీజన్ మొదలవకముందే చెన్నై జట్టు ఇంజురీ కారణంగా తమ మెయిన్-స్క్వాడ్ లో 4 ఆటగాళ్లను దూరం చేసుకున్నారు. ఎం.ఎస్.ధోని, బ్రెవిస్, ఎల్లిస్ మరియు జాన్సన్ పేరిట నలుగురు ప్లేయింగ్-11 సభ్యులు ఈ జట్టుకు అందుబాటులో లేకుండాపోయారు.

స్పష్టంగా చెన్నై జట్టులో టి-20 క్రికెట్ కు ఉండాల్సిన ఫైర్ మరియు ఇంటెంట్ కనిపించటంలేదు. ఈ కారణం చేతనే గత 2-3 సీజన్లుగా సి.ఎస్.కె జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. బ్రెవిస్ మరియు ఆయుష్ మాత్రమే పిచ్ తో సంబంధం లేకుండా జట్టుకు విలువైన పరుగులు అందించగలుగుతున్నారు.

మిగతా బ్యాటర్లు కూడా వారితో పాటి స్కోర్ చేయకుంటే ఈ సారి కూడా సి.ఎస్.కె జట్టు లీగ్ స్టేజి తో నే సరిపెట్టుకోకతప్పదు. ఇటు బౌలింన్గ్ విభాగంలో కూడా చెన్నై బౌలర్లలో అనుభవం ఉన్న బౌలర్లు పెద్దగా కనబడరు. ఇంత అనుభవరాహిత్యం ఉన్న బౌర్లతో చెన్నై జట్టు మున్ముందు ఎలా ప్రదర్శిస్తుందో అని ఫ్యాన్స్ తీవ్రంగా చింతుస్తున్నారు.

ఇక నిన్న జరిగిన చెన్నై-vs-పంజాబ్ పోరుకు మునుపు కూడా చెపాక్ స్టేడియంలో పంజాబ్ కు అద్భుతమైన రికార్డ్ ఉన్నట్టు తెలిసిందే. ఈ ఇరు జట్లు చెపాక్ వేదికగా ఆడిన 9 మ్యాచ్లలో 5 పంజాబ్ కైవసం చేసుకోగా, చెన్నై 4 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది.

అయితే నిన్నటి విక్టరీతో పంజాబ్ దీనిని 6-4 గా మార్చుకుని సంబరం చేసుకోగా, చెన్నై మాత్రం తమ పేలవమైన ఫామ్ ను కొనసాగిస్తూ మరోసారి సొంత గ్రౌండ్లో ఓటమిపాలయ్యారు. రేపు, ఏప్రిల్ 5న సి.ఎస్.కె జట్టు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు తో చిన్నస్వామి వేదికగా మ్యాచ్ ఆడనున్నారు. చూడాలి మరి చెన్నై జట్టు రేపైనా బోణి కొడుతుందా అని..?

ADVERTISEMENT
Latest Stories