
కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ ఎటువంటి హడావుడి లేకుండా నిశబ్ధంగానే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్నికలలో సీనియర్లకు టికెట్స్ నిరాకరించినందున బహుశః అందరూ అలిగి ‘సైలంట్ మోడ్’లో ఉండిపోయారేమో?
Also Read – మిల్వాకీ లో ATA ఉమెన్స్ డే మరియు ఉగాది వేడుకలు
కానీ హటాత్తుగా ఏపీ బీజేపీలో ప్రకంపనలు కలగడం విశేషం. ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరున్న కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు రెండు మూడు రోజులుగా వస్తున్న వార్తలే ఆ ప్రకంపనలకు కారణం. అటువంటి నేరచరిత్ర ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ప్రజలు ఏమనుకుంటారు?
ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ, “కొల్లం గంగిరెడ్డి ఎవరో నాకు తెలియదు. ఆయన పార్టీలో చేరుతున్నారని నేను ఎవరికీ చెప్పలేదు. కానీ మీడియాలో ఆ వార్తలు చూశాను. అవి నిజం కావు. బీజేపీ సిద్దాంతాల పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాళ్ళని మాత్రమే పార్టీలో చేర్చుకుంటాము. అదీ… సంబందిత జిల్లాలోని బీజేపీ కార్యవర్గం ఆమోదం తెలిపితేనే,” అని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
Also Read – కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా బీజేపీ పెద్దలతో విధేయంగా ఉంటున్నారు. నేటికీ విధేయంగానే ఉంటున్నారు. అది కేసుల నుంచి ఉపశమనం కోసమే అని అందరికీ తెలుసు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితని జైలు నుంచి విడిపించుకోవడానికి కేసీఆర్ తన రాజ్యసభ ఎంపీలని బీజేపీకి అప్పగించ బోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. కనుక అవినీతిపరులను బీజేపీ కాపాడుతోందని ఇప్పటికే అపవాదు ఉంది.
ఈ నేపధ్యంలో ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని బీజేపీలో చేర్చుకోవడం అంటే ఆ ఆరోపణని ధృవీకరిస్తున్నట్లే అవ్య్తుంది. బహుశః అందుకే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చివరి నిమిషంలో వెనక్కు తగ్గిన్నట్లున్నారు.
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?