CM Chandrababu Naidu

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌‌ పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో, ఐదేళ్ళ జగన్‌ పాలన తర్వాత అంత కంటే దయనీయంగా మారింది.

కారణాలు అందరికీ తెలుసు. సంక్షేమ పధకాల కోసం లక్షల కోట్లు అప్పులు, ఆ అప్పులు సరిపోకపోవడంతో ప్రభుత్వాస్తులను కూడా తాకట్టు పెట్టేశారు. సుమారు 10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినా కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించనే లేదు. వాటి కోసం కాంట్రాక్టర్లు నేటికీ కడప, తాడేపల్లి ప్యాలస్‌లకు వచ్చి జగన్‌ని నిలదీస్తూనే ఉన్నారు.

Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?

అన్ని పెండింగ్ బిల్లులు కలుపుకొని మొత్తం రూ.1.30 లక్షల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఈ నిర్వాకం గురించి జగన్‌, వైసీపీ నేతలకంటే మరెవరికి బాగా తెలుస్తుంది?అయినా ఎన్నికల హామీలు ఎందుకు అమలుచేయడం లేదంటూ నిసిగ్గుగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు.

Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?

కానీ జగన్‌ ప్రభుత్వ నిర్వాకం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి రాష్ట్ర ప్రజలకు కూడా బాగా తెలుసు. కనుకనే ఎన్నికల హామీల గురించి ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం లేదు.

కానీ అంత మాత్రాన్న సిఎం చంద్రబాబు నాయుడు హామీల అమలు చేయకుండా తప్పించుకోవాలని అనుకోవడం లేదు. కాస్త అలస్యమైనా ప్రతీ హామీని అమలు చేసి మాట నిలుపుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ముందుగా ఈ సంక్రాంతి పండుగకు ఈ పెండింగ్ బిల్లుకు రూ.6,700 కోట్లు విడుదల చేశారు.

Also Read – వ్యవస్థలకి జగన్‌ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!

జగన్‌ హయాంలో చిన్న కాంట్రాక్టర్లను పెద్దగా పట్టించుకునేవారు కారు. కానీ చంద్రబాబు నాయుడు వారి సమస్యల గురించి తెలుసు కనుక రూ.586 కోట్లు విడుదల చేశారు. తద్వారా 26 వేలమందికి ఊరట లభిస్తుంది.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము కూడా వాడేసుకున్నారు. టిడిఎస్ కింద మరో 265 కోట్లు చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ఆ బకాయిల కోసం రూ.1300 కోట్లు మంజూరు చేశారు.

జగన్‌ హయంలో అమరావతి రైతులు ఎన్నెన్నో అవమానాలు, వేధింపులకు గురయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు కౌలు రైతుల బకాయిలు రూ.244 కోట్లు విడుదల చేశారు.

జగన్‌ ఆరోగ్యశ్రీ పధకం పేరు చెప్పుకొని రాజకీయంగా లబ్ధి పొందారు కానీ ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా ఎగవేశారు. చంద్రబాబు నాయుడు ఆ బకాయిల కోసం రూ.500 కోట్లు విడుదల చేయాలని అధికారులని ఆదేశించారు.

ఫీజ్ రీ ఇంబర్స్‌మెంట్‌ కోసం రూ.788 కోట్లతో సహా అన్నీ కలిపి మొత్తం రూ.6,700 కోట్లు తక్షణం చెల్లించాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులని ఆదేశించారు.

జగన్‌ చేసిన అప్పులకు, వాటి వడ్డీలకే రాష్ట్ర ఆదాయంలో చాలా భాగం వెళ్ళిపోతున్నప్పటికీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు జరుగక చిన్న కాంట్రాక్టర్లు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు, కాలేజీలు, ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందుగా వారందరికీ చెల్లిస్తున్నామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.