
రాజకీయ పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతుంటాయి. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల ధోరణి నిశితంగా గమనిస్తే ఇది అర్దమవుతుంది.
శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓటమి తర్వాత ఏకంగా 10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఎన్నికలలో ఓడిపోయిన ఏ పార్టీకైనా ఇటువంటి చేదు అనుభవాలు మామూలే.
Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!
కనుక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కి వినతి పత్రాలు ఇచ్చింది. కానీ ఆయన స్పందించకపోవడంతో హైకోర్టుకి వెళ్ళింది. అక్కడా నిరాశ ఎదురవడంతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. నేడు ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఇదంతా చాలా సాధారణమే.
అయితే ఓటమీతో ఢీలాపడిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ధైర్యం నింపేందుకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు వేసిందని చెప్పవచ్చు. కానీ ఒకవేళ స్పీకర్ లేదా న్యాయస్థానాలు అనర్హత వేటు వేస్తే ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి.
Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!
రెండు వరుస ఓటములు, ఫిరాయింపులతో బిఆర్ఎస్ పార్టీ చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగితే అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపిలు ఆ స్థానాలన్నీటినీ అవలీలగా గెలుచుకుంటాయి. కనుక ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం బిఆర్ఎస్ పార్టీ గట్టిగా పట్టుబట్టలేదు.
కానీ ఇప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ పార్టీ ఈ కేసు విచారణ వేగవంతం కావాలని, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడాలని కోరుకోవడం గమనిస్తే తెలంగాణ పరిస్థితులు తమకి అనుకూలంగా ఉన్నాయని భావిస్తున్నట్లుంది లేదా రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి దాని లెక్కలు దానికి ఉంటాయి. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అంతా సానుకూల వాతావరణం ఉందని ధృవీకరించుకునే వరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించకుండా ప్రభుత్వ బలం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది.
కనుక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దేని లెక్కలు దానికి ఉన్నాయన్న మాట!