మూడు రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం ఏపీకి చేరుకున్న పవన్ అకస్మాతుగా కాకినాడకు ప్రయాణమయ్యారు. గత కొన్నేళ్లుగా కాకినాడ పోర్ట్ కేంద్రంగా జరుగుతున్న అక్రమ రేషన్ తరలింపు కు కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే కాస్త అడ్డుకట్ట వేయగలిగింది. దీనితో ఈ దందా నడుపుతున్న వారు కాస్త సైలెంట్ అయ్యారు.
పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్ట్ లో జరిగే అక్రమాల పై, అక్కడ అరాచక శక్తులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసే అరాచకాల పై ద్రుష్టి పెట్టి, అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు.
Also Read – మేము రోడ్లపై జగన్ ప్యాలస్‌లోనా.. ఎందుకు ?
గత కొన్నేళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, అధికారులను ప్రలోభ పెడుతూ, తమ అక్రమ దందాను కొనసాగిస్తున్న కొన్ని వైసీపీ పెద్దతలకాయిలు తమ మాఫియా పనులను ఏదోరకంగా అక్రమ మార్గంలో పూర్తి చేసేస్తున్నారు.
గత రెండు రోజుల క్రిందట కాకినాడ ఫోర్ట్ ఆధారంగా సముద్రంలోకి అక్రమ మార్గంలో బియ్యం స్మగ్లింగ్ చేస్తున్న ఓడను అధికారులు ఛేజ్ చేసి మరి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ లో పవన్ పర్యటన ఆసక్తికరంగా మారనుంది.
Also Read – సీక్వెల్స్: వైఫల్యం నుండి విజయం వరకు
గతంలో కూడా ద్వారం పూడి అక్రమాల మీద, అన్యాయాల మీద, అవినీతి మీద గట్టిగా పోరాటం చేసిన పవన్ తానూ అధికారంలోకి వస్తే ద్వారం పూడి అవినీతి ద్వారాలకు చెక్ పెట్టి తీరుతా అంటూ బలంగా ప్రచారం చేసారు. దీనితో ఇప్పుడు పవన్ చేస్తున్న ఈ ప్రయాణంతో ఎవరికి చెక్ పెడతారో అంటూ కాకినాడ వాసులు కూడా ఎదురు చూస్తున్నారు.
అసలు కాకినాడ లో అరాచకం, అక్రమం అనగానే అందరికి తలంపుకొచ్చే పేరు వైసీపీ నేత ద్వారం పూడి చంద్రశేఖర్. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఈ అక్రమ రేషన్ తరలింపు ద్వారా కొన్ని కోట్ల టర్నోవర్ వ్యాపారం చేసిన ఈ ప్రబుద్దుడు వేలకోట్లు వెనకేసుకున్నాడు.
Also Read – ద్వారంపూడికి కాకినాడ పోర్ట్.. మరి వైజాగ్ పోర్ట్ ఎవరికి?
స్థానికంగా కూడా తనను తలతన్నేవాడు లేడు అనే అహంకారంతో రెచ్చిపోయిన ద్వారపూడి రాజకీయానికి కూటమి పార్టీలు చెక్ పెట్టాయి. కానీ ఆయన అక్రమాలకు మాత్రం ఇంకా ముగింపు పలకలేకపోయింది. ఇప్పుడు పవన్ కాకినాడ పర్యటనతో ద్వారంపూడి అరాచకాలకు కూడా చెక్ పెట్టే అవకాశం లేకపోలేదు అంటున్నారు జనసైనికులు.