
నేడు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక ద్వారా లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు.
అందులో మెగా స్టార్ చిరంజీవి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీ సేవలు అభినందనీయం అంటూ లోకేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు. అయితే గత కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పదవి మీద టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య జరుగుతున్న వివాదం ముదరడంతో ఇరు పార్టీ అధినేతలు వారి పార్టీ శ్రేణులకు ఈ వివాదం మీద ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరికలు పంపడం జరిగింది.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తన సోషల్ మీడియా వేదికగా నారా లోకేష్ కు బర్త్ డే విషెస్ తెలియచేసారు. తన సోదర సమానుడైన నారా లోకేష్ కు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ లోకేష్ పై తనకున్న ఆప్యాయతను మరోమారు తమ పార్టీ శ్రేణులకు వివరించే ప్రయత్నం చేసారు పవన్.
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్ మరియు కమ్యూనికేషన్ మంత్రి గా ఏపీ అభివృధికి తోడ్పడుతున్న మీరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటూ ఏపీ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలంటూ మనసారా భగవంతుణ్ణి ప్రార్దిస్తా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన పార్టీల మధ్య సోషల్ మీడియాలో సాగుతున్న డిప్యూటీ సీఎం వివాదానికి ముగింపు పలికినట్టే అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
ఇలా ఈ రెండు పార్టీల మద్దతుదారుల మధ్య కొనసాగుతున్న వివాదానికి పవన్ విషెస్ తో ఫుల్ స్టాప్ పెట్టడం కూటమి బంధాన్ని గట్టి పడేయాలి చేస్తుంది. ఏపీ అభివృద్ధి, అమరావతి పునర్నిర్మాణమే కూటమి ధ్యేయం అన్నట్టుగా సాగుతున్న ఈ మహా యజ్ఞంలో ఇలాంటి వివాదాలను టీ కప్పులో తుఫాన్ మాదిరి ముగించాల్సిన బాధ్యత ఇరు పార్టీల అగ్రనేతల మీద ఉంటుంది.
ఇప్పుడు అదే పనిలో అటు టీడీపీ, ఇటు జనసేన అధినాయకత్వం వారి పార్టీ క్యాడర్ కు, లీడర్లకు సున్నితమైన హెచ్చరికలు, బలమైన సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా పవన్ ఎక్కువ, లోకేష్ తక్కువా.?, లేక బాబు నాయకత్వమా.? పవన్ ఆదేశమా.? అనే ఆలోచనలకు స్వస్తి చెప్పి, ఇక్కడ అందరు సమానమే అనే భావనలో ఇరు పార్టీల క్యాడర్, లీడర్ కూటమి బంధాన్ని గౌరవించాలి.