ట్రైలర్ టాక్ – చూడాలంటే సహనం ఉండాలి!

Desamlo-Dongalu-Paddaru-Official-Trailer ధియేటిరికల్ ట్రైలర్ చూసిన తర్వాత దీనిని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసారా? అన్న సందేహం కలుగక మానదు. బహుశా అలీతో ఉన్న సన్నిహిత సంబంధం రీత్యా… ఈ ట్రైలర్ ను లాంచ్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చారో ఏమో గానీ, రెండున్నర్ర నిముషాల నిడివి గల ఈ ధియేటిరికల్ ట్రైలర్ ను చూడాలంటే సహనం ఓ స్థాయిలో ఉండాల్సిందే.

[m9ad]

ADVERTISEMENT

“దేశంలో దొంగలు పడ్డారు” అన్న పేరుతో అలీ సోదరుడు ఖయ్యుం అలీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ ట్రైలర్ ఏ విభాగంలోనూ, ఏ స్థాయిలోనూ ఆకట్టుకోదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లో ఇలాంటి ట్రైలర్లు చూడాల్సి రావడం శోచనీయం. ఈ సినిమాను కమెడియన్ అలీ చాలా గర్వంగా ప్రజెంట్ చేస్తుండడం మరో విషయం.

ADVERTISEMENT
Latest Stories