Development of Port Areas in AP

ఏదైనా ఉన్నప్పుడు దాని విలువ ఎవరూ గుర్తించరు కానీ లేనప్పుడే దాని విలువ తెలిసి వస్తుంది. అది ఆత్మీయులు కావచ్చు, నీళ్ళు, కరెంటు, సహజ వనరులు మంచి ప్రభుత్వం.. ఏదైనా కావచ్చు.

రాష్ట్ర విభజనతో అన్ని విదాలుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం తెలంగాణ రాష్ట్రానికి దక్కినప్పటికీ, తెలంగాణకు లేని అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు, సహజ వనరులు, సువిశాలమైన సముద్రతీరం ఏపీకి ఉన్నాయి.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

సముద్రతీరం ఉంది కనుక ఎక్కడికక్కడ పోర్టులు కూడా ఉన్నాయి. కనుక విదేశాలకు ఎగుమతి, దిగుమతి చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.

ఏపీకి ఇన్ని సానుకూలతలు ఉన్నప్పటికీ జగన్‌ ప్రభుత్వం వాటిని గుర్తించలేకపోయింది. కనుక అభివృద్ధి చేయలేదు.

Also Read – జగన్‌ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!

జగన్‌ ప్రభుత్వం గుర్తించకపోయినా వైసీపీ నేతలు కాకినాడ పోర్టు విలువ బాగా గుర్తించారు. కనుక అక్కడి నుంచి 5 ఏళ్ళు రేషన్ బియ్యం ఎగుమతి చేస్తూ పోర్టుని బాగా వాడేసుకున్నారు.

విజయసాయి రెడ్డి తదితరులు మరో అడుగు ముందుకు వేసి కాకినాడ పోర్టుని సొంతం చేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు చర్చ పోర్టుల కబ్జా, రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి కాదు. ఆ పోర్టుల ప్రాధాన్యత గురించి.

Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?

రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ ఏవిదంగా తెలంగాణకు దక్కిందో, అదేవిదంగా ప్రఖ్యాత తిరుమల దేవస్థానం, పోర్టులు ఏపీకి దక్కాయి.

హైదరాబాద్‌లో ఉన్న ఆర్టీసీ తదితర ఉమ్మడి సంస్థల స్థిరాస్తులలో ఏపీకి వాటా పంచి ఇవ్వడానికి నిరాకరించిన కేసీఆర్‌, తిరుమల, బందరు పోర్టులో తెలంగాణకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండేవారు. అంటే బందరు పోర్టు ఎంత విలువైనదో, దానికి ఎంత ప్రాధాన్యత ఉందో అర్దం చేసుకోవచ్చు.

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా బందరు పోర్టు గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆయన చాలా సహేతుకంగా ప్రతిపాదన చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పోర్టులు లేవు కనుక రాష్ట్రంలో ఓ డ్రై పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని, అక్కడి నుంచి బందరు పోర్టుని కలుపుతూ రహదారులు నిర్మించాలని నిన్న ప్రధాని మోడీని కలిసినప్పుడు విజ్ఞప్తి చేశారు.

తద్వారా తెలంగాణ నుంచి బండారు పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు పెరుగుతాయని సూచించారు.

తెలంగాణ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, రేవంత్ రెడ్డి బందరు పోర్టు విలువ గుర్తించారు. కానీ ఏపీకి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్‌ గుర్తించలేకపోయారు! ఒకవేళ గుర్తించి ఉండి ఉంటే నేడు ఏపీలో పోర్టులకు మహర్ధశ వచ్చేది!

జగన్‌ పట్టించుకోనప్పటికీ కూటమి ప్రభుత్వం పోర్టుల ప్రాధాన్యతని బాగానే గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

పోర్టులకు అనుబందంగా 50-100 కిమీ పరిధిలో అత్యాధునిక సౌకర్యాలతో చిన్న పట్టణాలు, వాటిలో పారిశ్రామికవాడలు, గోదాములు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతి, దిగుమతులకు వీలున్న పరిశ్రమలు వీటిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జనవరి 8వ తేదీన ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు రూ.2,139 కోట్ల పెట్టుబడితో కృష్ణపట్నం పోర్టుకి అనుబందంగా నిర్మించబోతున్న ఇండస్ట్రియల్ సిటీ (క్రిస్ సిటీ)కి కూడా శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.




కనుక ఆంధ్రాలో సహజ వనరులు, పర్యాటక కేంద్రాలు, ఇటువంటి పోర్టులను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే చాలు.. రాష్ట్రానికి భారీగా ఆదాయం పెరుగుతుంది. లక్షలాదిమందికి ఉద్యోగాలు ఉపాది లభిస్తాయి.