
వైసీపీ ప్రభుత్వ విధానానికి ముందు వరకు రాష్ట్రంలో ప్రభుత్వాల విధి అభివృద్ధి… సంక్షేమం మాత్రమే అనేలా ఉండేవి. ఈ రెండిటిని జోడెడ్ల బండి మాదిరి సమంగా బ్యాలెన్స్ చేసిన నాయకులను, పార్టీలను ప్రజలు ఆదరించేవారు, అలాగే అందలం ఎక్కించేవారు.
కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలన తరువాత, అధికారాన్ని అడ్డుపెట్టుకుని బాధ్యత యుత పదవులలో ఉన్న వారు చేసిన అరాచకాలను కళ్లారాచూసిన తరువాత ఇప్పుడు అభివృద్ధి…సంక్షేమం తో పాటుగా గత ప్రభుత్వ అరాచకవాదుల అరెస్టులు కూడా కూటమి ప్రభుత్వానికి తప్పనిసరైయింది.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
దీనితో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పాలన విధానాలు, పార్టీ అంతర్గత వ్యవహారాలు, పొత్తుల సమీకరణాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, రాజధాని నిర్మాణం తో పాటుగా గత ఐదేళ్లు అప్రజాస్వామ్యంగా వ్యవహరించిన ప్రతి ఒక్క వైసీపీ నేతను కూడా కట్టడి చేయవలసిన బాధ్యత బాబు భుజాన పడింది.
ఇందులో భాగంగానే బోరుగడ్డ అనిల్ మొదలుకుని వర్రా రవీంద్రా రెడ్డి, వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణ మురళి వంటి వైసీపీ ఉగ్రవాదులను పట్టి బందించి జైలుకు పంపారు బాబు. ఇక ఇక్కడితో వైసీపీ నేతల అరెస్టులకు ముగింపు పలికినట్టేనా అంటే ఇంకా ఈ వరుసలో అనేకమంది వైసీపీ నేతలు పోటీపడుతున్నారు.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
అందులో ముఖ్యంగా కొడాలి, పేర్ని, రోజా, జోగి, శ్రీరెడ్డి, ఆర్జీవీ, గోరంట్ల ఇలా చెప్పుకుంటూ పొతే పెద్దే లిస్టే సిద్ధంగా ఉంది. అయితే ఇందులో ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో అరెస్టవుతారు అనేది మాత్రం ఎవరు ఊహించలేరు అనేది సుస్పష్టం. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేకమంది టీడీపీ నాయకులను అప్పటి ప్రభుత్వం జైలుకి పంపించింది.
అయితే ఆ అరెస్టుల పట్ల ప్రజలలో టీడీపీ పార్టీ మీద సానుభూతి వచ్చింది, అలాగే ఆయా నాయకుల అరెస్ట్ విధానాల మీద వైసీపీ ప్రబుత్వం పై ప్రజలలో ద్వేషం కలిగింది. దాని ఫలితమే నేటి వైసీపీ దుస్థితి, కూటమి పరిస్థితి. అనూహ్యంగా నేడు జరుగుతున్న వైసీపీ నేతలు అరెస్టుల మీద ప్రభుత్వం పట్ల ప్రజలలో ఎటువంటి వ్యతిరేఖత రాలేదు, అలాగే వైసీపీ పార్టీ నాయకుల పట్ల పిసరంతైనా సానుభూతి కలగడం లేదు.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
దానికి తోడు ఈ అరెస్టులు ఇక్కడితో ఆగకూడదు, వీరందరిని సభ్యసమాజంలో తిరగనివ్వకూడదు అంటూ సామాన్యుడు సైతం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలుకుతున్నాడు. ప్రభుత్వం నుండి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం ఎలా అయితే ఆశిస్తున్నారో అదే తీరుగా వైసీపీ నేతల అరెస్టులను కూడా కొనసాగాలని ఆశిస్తున్నారు సామాన్య ప్రజానీకం.
మరి ఇంతటి ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న నాయకులను వెనకేసుకొస్తున్న వైసీపీ అధినేత వైస్ జగన్ మాత్రం ఇప్పటికి అటువంటి నాయకులకు వంత పాడుతూ వారికి పరామర్శలు, ఓదార్పులు అందిస్తూ అరాచకమే వైసీపీ సిద్ధాంతం అనేలా వ్యవహరిస్తున్నారు.