రాగింగ్ అంటే ఇదీ… కానీ వద్దు!

dgp-dwaraka-tirumala-rao-memorandum-to-waiting-ips-officers

జగన్‌ చేసిన తప్పులకు వైసీపి బలైపోయింది. కానీ వైసీపిలో చాలా మంది తమ అధినేతతో పోటీ పడి తప్పులు చేశారు. వాటికి వారందరూ ఎన్నికలలో మూల్యం చెల్లించారు. అయితే వారి అండదండలు లేదా ప్రోత్సాహంతో కొందరు ఉన్నతాధికారులు కూడా చెలరేగిపోయారు. వారి ధాటికి ప్రతిపక్ష నేతలు, మీడియా చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా బలైపోయారు.

ADVERTISEMENT

బహుశః జగన్‌ ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆయన నీడలో తాము హాయిగా బ్రతికేయవచ్చనే గుడ్డి నమ్మకంతోనే కొందరు అధికారులు చెలరేగిపోయారని అనుకోవచ్చు. అటువంటి వారిలో డిజిపిలు పీఎస్ఆర్‌ ఆంజనేయులు, పీవీ సునిల్ కుమార్, ఎన్‌. సంజయ్, ఐజీలు జి. పాలరాజు, కొల్లి రఘురామ రెడ్డి తదితరులు మొత్తం 16 మంది ఉన్నారు.

ఏపీలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారందరినీ పక్కనపెట్టి వారి స్థానాలలో వేరే అధికారులను నియమించింది. రెండు నెలలుగా ఆ 16 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. అందరినీ మంగళగిరిలో పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అయితే వారికి ఏ బాధ్యతలు అప్పగించకపోవడంతో వారిలో చాలా మంది కార్యాలయానికి రావడం మానుకున్నారు.

ఈ విషయం డిజిపి ద్వారకా తిరుమల రావు దృష్టికి రావడంతో వారందరికీ ప్రత్యేక ఆదేశం జారీ చేశారు. అందరూ తప్పనిసరిగా ప్రతీరోజు ఉదయం 10 గంటలకు వచ్చి, సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలోనే ఉండాలని, వచ్చినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అటెండన్స్ రిజిస్టర్‌లో సంతకం చేయాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆ 16 మంది అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ఎప్పుడు ఏ బాధ్యతలు అప్పగించినా చేసేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.

ఆ స్థాయి అధికారులకు ఏ బాధ్యత అప్పగించకుండా కార్యాలయంలో ఖాళీగా కూర్చోబెట్టడం కంటే అవమానం, శిక్ష మరొకటి ఉండదు. కానీ అది స్వయంకృతమే.

అందరికీ ఆదర్శంగా ఉంటూ మార్గదర్శనం చేయాల్సిన జగన్మోహన్‌ రెడ్డి, తాను స్వయంగా తప్పు దారిలో నడుస్తూ అందరినీ కూడా తప్పు దారిలో నడిపించారు. కనుక జగన్‌తో ఏవిదంగా కనెక్ట్ అయినా చివరికి మూల్యం చెల్లించక తప్పదని స్పష్టమవుతోంది.

ఈ ఉన్నతాధికారులు ఏ కారణం చేత చాలా తప్పులు చేసినప్పటికీ వారిని ఈవిదంగా ఖాళీగా కూర్చోబెట్టి నెలనెలా లక్షల రూపాయలు జీతాలు చెల్లించడం వలన ప్రభుత్వానికే నష్టం. కనుక టిడిపి కూటమి ప్రభుత్వం వారికి ఏదో ఓ బాధ్యత అప్పగించి పని చేయించుకోవడమే మంచిది. లేకుంటే ఇదో దుసాంప్రదాయంగా మారి చివరికి ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థ నిరుపయోగంగా మారుతుంది.

ఉదాహరణకు టిడిపి హయాంలో చేసిన ఏబీ వేంకటేశ్వర రావుపై జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపులకి పాల్పడి 5 ఏళ్ళు సర్వీసులోకి తీసుకోలేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆయనకు బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. ఇప్పుడు టిడిపి ప్రభుత్వం ఏకంగా 16 మంది అధికారులను పక్కన పెట్టింది. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తీసి పక్కన పెట్టేస్తుంటే చివరికి మిగిలేది ఎవరు?

ADVERTISEMENT
Latest Stories