నేను అమాయకుడిని కాను..మళ్ళీ నాకే టికెట్…తగ్గేదేలే!

Dharmana_Krishnadas_YSRCPసిఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తేనెతుట్టెను చూసి ముచ్చటపడుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల మద్య టికెట్ల కోసం కీచులాటలు మొదలయిపోయాయి. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇతర నేతలకు మద్య టికెట్ పంచాయితీ నడుస్తోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ పంచాయతీ మొదలైంది.

శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం నరసన్నపేటలో ఓ కళ్యాణమండపంలో నియోజకవర్గం స్థాయి ప్లీనరీ నిర్వహించినప్పుడు ఈ విషయం ఆయనే స్వయంగా బయటపెట్టారు. పార్టీ నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పార్టీలో గ్రూపులు కట్టి రాజకీయాలు చేయడం మానుకోవాలి. కొంతమంది నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలలో అపోహలు కలిగేలా మాట్లాడుతున్నారు. వారు అటువంటి ప్రయత్నాలు మానుకోవాలి.

ADVERTISEMENT

అయినా ఒక నియోజకవర్గంలో ఎంత మందికి ఎమ్మెల్యేలు కాగలరు? ఒక్కరే కదా?ఆ ఒక్కడినీ నేనే అని అందరికీ తెలిసి ఉన్నప్పుడు మళ్ళీ వేరెవరికో టికెట్ వస్తుందన్నట్లు ఎందుకు పుకార్లు పుట్టిస్తున్నారు?మీలో చాలామంది నేను చాలా అమాయకుడిని అనుకొంటున్నారని నాకు తెలుసు. కానీ నేను అమాయకుడిని కాను. అమాయకుడినీ అయితే వరుసగా నాలుగుసార్లు గెలిచేవాడినే కాదు. వచ్చే ఎన్నికలలో కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయేది నేనే. ఈ విషయంలో తగ్గేదేలే.

పార్టీలో ఎవరైనా గ్రూపులు కట్టి సమస్యలు సృష్టించాలని ఉపేక్షించేది లేదు. సిఎం జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోమని అడుగుతాను,” అని సున్నితంగా హెచ్చరించారు.

వైసీపీ నేతలు ఇప్పటి నుంచే టికెట్ల కోసం ఈస్థాయిలో కీచులాడుకొంటునప్పుడు, వేరేవారికి టికెట్ ఇస్తే ఏమి చేస్తారో అందరికీ తెలుసు. వారిలో వారే కీచులాడుకొంటున్నప్పుడు ఇక టిడిపితో ఏం పోరాడగలరు?

ADVERTISEMENT
Latest Stories