మెగా vs అల్లు అంటూ సోషల్ మీడియాలో మొదలైన ఫ్యాన్ వార్ ను తన పార్టీ రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవాలని చూసిన వైసీపీ రాజకీయం మీద అల్లు అర్జున్ నీళ్లు పోసినట్టే అనిపిస్తుంది.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన దుర్ఘటనకు గాను అల్లు అర్జున్ జీవితం లో ఎదురైన ఆ ‘అనుకోకుండా ఒక రోజు’ ఉదాంతం బన్నీ మధ్యంతర బైలుతో ఓదార్పులు, పరామర్శలు అంటూ ముందుకెళ్లింది. అలాగే తనకు మద్దతుగా నిలిచిన మెగా కుటుంబానికి కూడా బన్నీ కృతఙ్ఞతలు తెలియచేస్తూ మెగా స్టార్ చిరు, నాగబాబు ఇంటికి వెళ్లి తామంతా ఒకటే కుటుంబం అనే సంకేతాన్ని ఇచ్చారు.
దీనితో ఇక అల్లు అర్జున్ ను అడ్డుపెట్టుకుని అటు జనసేనను, ఇటు మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తన కుటుంబంలో మొదలైన రాజకీయ, ఆర్థిక వివాదాలను కప్పేయాలని చూసిన వైసీపీ అధినేత జగన్ వ్యూహాల మీద అల్లు అర్జున్ నీళ్లుపోసినట్టయ్యింది. మొన్నటి దాక జూ.ఎన్టీఆర్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ పార్టీని, చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసిన వైసీపీ ఇక అల్లు వివాదం తెర మీదకు రాగానే దానికి బ్రేక్ ఇచ్చి దీన్ని భుజానకెత్తుకుని రాజకీయం చేయడం మొదలు పెట్టింది.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
అయితే ఇప్పుడు బన్నీ అటు చిరంజీవితో, ఇటు నాగబాబు తో కలిసి ముచ్చటించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో ఈ వాదనకు బలం తగ్గిపోయింది. అయినా కూడా వైసీపీ ఇప్పుడే ఈ వివాదాన్ని చల్లారనిస్తుందని భావించలేము. ఎందుకంటే అల్లు అర్జున్ చిరు, నాగబాబులనే కలిశారు కానీ పవన్ ను కలవలేదు కదా అంటూ ఇప్పుడు పవన్ vs బన్నీ అంటూ కథ మొదటి నుంచి మొదలుపెట్టే అవకాశం లేకపోలేదు.
తన ఇంటిలో సొంత చెల్లి, తల్లితో వచ్చిన విభేదాలు పరిష్కరించుకోవడం చేతకాక న్యాయస్థానాలను ఆశ్రయించిన జగన్ ఎదుటి వారి కుటుంబాలలో మాత్రం చీలికలు సృష్టించగలరు, వివాదాలను పెద్దవి చేసి చూపించగలరు. మరి ఈ వైసీపీ ఉచ్చు నుంచి బన్నీ బయటపట్టినట్టేనా.? మెగా vs అల్లు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టేనా.? దీనికి కాలమే బదులు చెప్పగలదు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…