chandrababu-naidu-apsrtc

ఆర్టీసీ సమ్మె అంటే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 55 రోజుల పాటు సాగిన సమ్మె కళ్ళ ముందు మెదులుతుంది. కేసీఆర్‌ మొండి వైఖరి కారణంగా సుమారు 25-35 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. కొందరు గుండెపోటుతో చనిపోగా, కొందరు ఆర్ధిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.

చివరికి ఆర్టీసీ కార్మికులే కాళ్ళ బేరానికి దిగివస్తే, అప్పుడు కేసీఆర్‌ వారికి ప్రగతి భవన్‌లో విందుభోజనం పెట్టి వారి చేత జేజేలు కొట్టించుకున్నారు. పాలాభిషేకాలు కూడా చేయించుకున్నారు. ఆ తర్వాత ఆర్టీసీలో యూనియన్లు, నాయకులు లేకుండా చేశారు. ఆనాటి కష్టాలు, కన్నీళ్ళు ప్రతీ ఆర్టీసీ కార్మికుడికి చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

Also Read – వైసీపీ కి ఆ అర్హత ఉందా.? కానీ జనసేన బాధ్యత..!

ఈ నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. ఒకవేళ యాజమాన్యం స్పందించకపోతే ఫిబ్రవరి 9 తర్వాత సమ్మె మొదలుపెడతామని ఆర్టీసీ కార్మిక నాయకులు చెప్పారు.

ఇప్పుడు కూడా వారు గొంతెమ్మ కోరికలు ఏమీ కోరడం లేదు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయవద్దని కోరారు. ఆర్టీసీ కార్మికులు దాచుకున్న పీఫీ సొమ్ముని పీఎఫ్ కార్యాలయానికి జమా చేయాలని కోరారు. తమ బకాయిలు చెల్లించాలని, మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటలలోపు ఇళ్ళు చేరుకునే విదంగా డ్యూటీలు వేయాలని కోరారు.

Also Read – వ్యవస్థలకి జగన్‌ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటి నుంచి తమపై పనిభారం పెరిగిపోయిందని కొత్తగా ఉద్యోగులను భర్తీ చేసి, తమకు రోజుకి 8 గంటల డ్యూటీలకు పరిమితం చేయాలని కోరారు. అదనపు భారానికి తగ్గట్లుగా కొత్త బస్సులు కొనుగోలుచేయాలని కోరారు.

గతంలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు వారికి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక వారి సమస్యలను సానుభూతితో అర్దం చేసుకొని పరిష్కరిస్తారో లేదో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..

కానీ మహాలక్ష్మీ పధకం అమలు చేస్తుండటం వలన తెలంగాణ ఆర్టీసీమీద, ప్రభుత్వం మీద, ఆర్టీసీ కార్మికుల మీద అదనపు భారం పడుతోందని స్పష్టం అయ్యింది.




అందుకే సిఎం చంద్రబాబు నాయుడు ఈ పధకం అమలుకి తొందరపడటం లేదు. ఒకవేళ హడావుడిగా పధకం ప్రారంభించి ఉంటే నేడు ఏపీ ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మికులు కూడా ఇటువంటి సమస్యలే ఎదుర్కోవలసి వచ్చేది కదా? కనుక ఈ పధకం అమలుచేయడం లేదనే విమర్శల కంటే, ఏపీఎస్ ఆర్టీసీని, దానిలో కార్మికులను కాపాడుకోవడమే మంచిది కదా?