pawan-kalyan-and-nara-lokesh

టీడీపీ, జనసేన పార్టీల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న ‘డిప్యూటీ సీఎం’ వివాదం రోజురోజుకి రచ్చ లేపుతుంది. లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం గా చేయాలి అంటూ టీడీపీ నేతలు పట్టుబడుతుంటే, పవన్ ఒక్కడే దానికి అర్హుడు అంటూ జనసైనికులు వాదిస్తున్నారు.

అయితే ఇక్కడ ఎవరికీ ఏ పదవి ఇవ్వాలో, ఎవరికీ ఏ బాధ్యత అప్పగించాలో క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి సీఎం గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. నిజంగా ప్రభుత్వానికి, రాష్ట్రానికి లోకేష్ డిప్యూటీ సీఎం గా అవసరం అన్న రోజు స్వయంగా బాబే ఆ నిర్ణయం తీసుకోగలరు, అలాగే అందుకు పవన్ ను ఒప్పించనుగలరు.

Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..

గత ఐదేళ్ల వైసీపీ గ్రహణంతో ఏపీ ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతింది. పారిశ్రామిక వేత్తలు ఇప్పటికి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారు. ఏపీలో తిరిగి వైసీపీ అధికారాన్ని చేపడితే అనే ప్రశ్న పెట్టుబడిదారులను వెంటాడుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రయత్నంలో బాబు తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు.

అటు ఐటీ మంత్రిగా నారా లోకేష్ కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే ఇటు విద్యా శాఖ మంత్రిగా కూడా అందరి ఊహలకు మించి పని చేస్తున్నారు. అన్నా, కష్టం అంటూ ఎవరైనా తన వద్దకు సోషల్ మీడియా ద్వారా సమస్యను లేవనెత్తినా వెంటనే ఆ సమస్య పై స్పందిస్తూ, పరిష్కారానికి తన హద్దుదాటి మరి అడుగు ముందుకేస్తున్నారు సమస్య పరిష్కారిస్తున్నారు.

Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?

ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి కూడా మంగళగిరిలో ఓడిపోయాడు అంటూ హేళన చేసిన ప్రతి ఒక్కరికి 2024 లో ఏకంగా 90 వేల ఓట్ల మెజారిటీ సాధించి నాలుగు దశాబ్దాల తరువాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేసాడు, అదే మంగళగిరిని టీడీపీ కంచుకోటగా మార్చుకున్నాడు. తానూ కావాలి అనుకున్న దానికోసం లోకేష్ ఎంత కష్టాన్నైనా మోయగలడు అనేది మంగళగిరిలో లోకేష్ సాధించిన మెజారిటీతో రుజువయ్యింది.

అలాగే పవన్ విషయంలో కూడా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు అని వేలెత్తి చూపిన వారితోనే 100 %స్టైక్ రేట్ సాధించి ఎత్తిన ప్రతి వేలుకు సమాధానం చెప్పాడు. ఇలా రాష్ట్రం కోసం రెండు జెండాలు, ఒకటే ఎజండా అంటూ నిబద్ధతగా, నిష్కళంకంగా ఈ ముగ్గురు శ్రమిస్తుంటే కొంతమంది పార్టీ మద్దతుదారులు ఇలా పదవులు అనే చిన్న విషయాన్ని వివాదంగా మలుస్తున్నారు.

Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!

ఇది ముమ్మాటికీ పొత్తు ధర్మానికి తిరోధకాలు ఇచ్చినట్టే అవుతుంది. ఈ విషయంలో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కాస్త సంయమనం పాటించి వ్యవహరించడం రెండు పార్టీలకే కాదు రాష్ట్రానికి కూడా శ్రేయస్కరం. ఇలా ఒక్క పదవి కోసం రెండు పార్టీల మధ్య మొదలైన ఈ వివాదం అటు వైసీపీ పార్టీకి ఆ పార్టీ మద్దతుదారులకు, బ్లూ మీడియాకు మంచి విందు భోజనం అందించినట్టు అయ్యింది.




దినీతో ఇక వైసీపీ శ్రేణుల ఆశలకు కొత్తగా రెక్కలుస్తున్నాయి, బ్లూ మీడియాకు స్పెషల్ స్టోరీలొస్తున్నాయి, వేటిలేటర్ మీద ఉన్న పార్టీకి జీవం వస్తుంది. ఇప్పటికైనా ఈ వివాదానికి ఇరు పార్టీల శ్రేణులు ఫుల్ స్టాప్ పెట్టడం కూటమి ప్రభుత్వానికి మంచిది.