ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ మీడియాకు హింట్ ఇచ్చాడా? ఎన్ఠీఆర్ బయోపిక్ లో మూడో పార్ట్ కూడా ఉంటుంది అని క్రిష్ చెబుతున్నాడా? అంటే అవును అనే అంటున్నాయి మీడియా వర్గాలు.
ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, దర్శకుడు క్రిష్ తాజాగా టీవీ-9 ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్ఠీఆర్ జీవితాన్ని తెరకెక్కించాలి అంటే ఎన్ని పార్ట్స్ తీసినా సరిపోదు అని, అయితే ఏది మిస్ అవకుండా తియ్యాలి అంటే సినిమా కొద్దిగా పెద్దగానే ఉంటుంది అని తెలిపారు.
ఈ క్రమంలో టీవీ 9 రిపోర్టర్ మాట్లాడుతూ అంటే ఈ లెక్కన మూడో పార్ట్ కూడా తీస్తారా? మూడో పార్ట్ కూడా వస్తుంది అని మేము అనుకోవచ్చా?అని అడగగా…ఖచ్చితంగా అన్నట్లుగా సమాధానం చెప్పారు క్రిష్.
అయితే అసలే ఒక పక్క ఎన్ఠీఆర్ తొలి భాగం లాస్ ను మిగల్చగా..ఆ ప్రభావం ఎక్కడ రెండో భాగంపై పడుతుందో అని బయ్యర్స్ భయంతో ఉండగా..ఇప్పుడు క్రిష్ మూడో పార్ట్ హింట్స్ ఇస్తూ ఉంటే, ట్రేడ్ నుంచి బయ్యర్స్ వరకూ కాస్త సందిగ్ధంలోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది.
మరి క్రిష్ మదిలో మెదులుతున్న మూడో పార్ట్ ఎంతవరకూ నిజమో తెలియాలి అంటే మాత్రం ఖచ్చితంగా రెండో పార్టీ పూర్తి అయ్యి, భారీ సక్సెస్ అవ్వాల్సిందే.



