ఎవరూ ఊహించని కాంభినేషన్స్ లో పూరీ జగన్నాధ్ – బాలకృష్ణల జోడి ఒకటి. బహుశా వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తారని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేసి ఉండకవపోవచ్చు. అలాంటిది ఇటీవల ఓ అధికారిక ప్రకటన రావడం, వెంటనే పూజా కార్యక్రమాలు జరుపుకోవడం, అదే రోజున సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడం… తాజాగా షూటింగ్ ప్రారంభించేయడం… ఇలా అన్నీ ఎక్స్ ప్రెస్ వేలో జరిగిపోయాయి.
గురువారం నాడు ప్రారంభమైన షూటింగ్ తొలి రోజు ఎలా జరిగింది? అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో వ్యక్తమవుతున్న తరుణంలో… దానికి సమాధానమిస్తూ దర్శకుడు పూరీ జగన్నాధ్ సోషల్ మీడియాలో తన అనుభూతులను తెలిపారు. “నందమూరి బాలకృష్ణ గారితో డే 1 షూటింగ్ ముగిసింది, ఫుల్ ఎనర్జీతో ఆయన ఉన్నారు, ఈ సినిమా కోసం వేచిచూడండి” అంటూ తెలిపారు పూరీ.
మాస్ పల్స్ ను పట్టుకోవడం పూరీ శైలే వేరు. అలాగే తన డైలాగ్స్ తో మాస్ ప్రేక్షకులను సమ్మోహితులను చేయడంలో బాలయ్య రేంజ్ వేరు. దీంతో వీరిద్దరి కలయిక మిక్కిలి ఆసక్తికరంగా మారింది. అందులోనూ పూరీ రాసే ‘సింగిల్ లైన్ పంచ్’లను బాలయ్య ఎలా పేలుస్తారోనని నందమూరి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెప్పిన డేట్ కు ఒక రోజు ముందైనా రిలీజ్ చేస్తానేమో గానీ, ఆలస్యం కాదు అని బల్లగుద్ది చెప్పారు పూరీ.



