
జగన్ శిక్షణలో వైసీపీ నేతలందరూ బాగా రాటు తేలారనే చెప్పొచ్చు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయబోతే దానిపైనే ఎదురు కేసులు వేసి ఎలా ముప్పతిప్పలు పెట్టారో అందరూ చూశారు. అలాగే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో జగన్, వైసీపీ ఏవిదంగా ప్రభుత్వం మీద ఎదురుడాడులు చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది.
తాజాగా అదానీ-జగన్ రూ.1,700 కోట్ల కుంభకోణం బయటపడినప్పుడు కూడా అలాగే టీడీపీ మీద, ప్రభుత్వం మీద వైసీపీ స్వంత మీడియాలో ఏవిదంగా ఎదురుదాడి చేస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు.
Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!
అంటే తప్పు చేసి దొరికిపోతే ఏమాత్రం భయపడకూడదన్న మాట! వెంటనే వీలనంత ధీటుగా ఎదురుదాడి చేస్తూ, ప్రత్యర్ధులే ఏదో చేయకూడని తప్పు చేశారనే అనుమానం, అపోహలు ప్రజలకు కల్పించే ప్రయత్నం చేయాలన్న మాట!
తద్వారా ప్రజల దృష్టి అసలు సమస్య మీద నుంచి మళ్ళించి ఈ వాదోపవాదాలపైనే దృష్టి పెట్టేలా చేస్తే సమస్య నుంచి బయటపడిన్నట్లే అన్నమాట! వైసీపీలో అందరూ ఈ ఫార్ములాని బాగా ఒంటబట్టించుకొని అవసరం పడినప్పుడల్లా విరివిగా వాడుకుంటూ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
ఇంతకీ విషయం ఏమిటంటే, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్ ఇదివరకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశయించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కనుక ఆయనపై కేసు నమోదైంది. అంటే అరెస్టుకి రంగం సిద్దమైన్నట్లే. కనుక ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళగా, ఆదివారం ఉదయం దివ్వెల మాధురి టెక్కలి పోలీస్ స్టేషన్లో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పిర్యాదు చేశారు.
వారు తన గురించి, దువ్వాడ శ్రీనివాస్ గురించి సోషల్ మీడియాలో చాలా అనుచితమైన పోస్టులు పెడుతూ వేదిస్తున్నారని దివ్వెల మాధురీ పిర్యాదు చేశారు. పనిలో పనిగా రెండేళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ కూడా తన దువ్వాడని ‘హర్ట్’ అయ్యేలా కామెంట్స్ చేశారని, కనుక ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని దివ్వెల మాధురీ పోలీసులకు పిర్యాదు చేశారు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
ఇంతకీ దివ్వెల మాధూరి ఎవరు? అని సందేహం వస్తే ‘గూగుల్’ని అడిగితే చెపుతుంది. ఈ కేసులో పవన్ కళ్యాణ్ పేరుని కూడా జోడించే ప్రయత్నం చూస్తే ఇంతకీ ఆమె కేసు ఎందుకు పెట్టారు? అనే సందేహం కలుగక మానదు.