నవంబర్ 5వ తేదీన జరుగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఇంతవరకు డెమొక్రాట్ అభ్యర్ధిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉండటంతో రిపబ్లికన్ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతుండేవారు. కానీ హటాత్తుగా జో బైడెన్ ఈ రేసు నుంచి తప్పుకొని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ని బరిలో దించడంతో డొనాల్డ్ ట్రంప్ షాక్ తిన్నారు.
Also Read – జమిలి ‘లబ్ది’ దారులెవ్వరు.?
కానీ వెంటనే తేరుకొని ఆమెపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేస్తూ ఎన్నికల ప్రచారంలో పైచేయి సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ప్రయత్నంలో ఆమెను ఉద్దేశ్యించి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు వివాదాస్పదంగా మారి ఆయనకే ఎక్కువ నష్టం కలిగిస్తున్నాయి.
కమలా హారిస్ తల్లి తండ్రులు భారత్-ఆఫ్రికా దేశాలకు చెందినవారు కనుక ఆమెకు ఇటు భారతీయమూలాలు, తండ్రి వలన ఆఫ్రికా మూలాలు కలిగి ఉన్నందున నల్లజాతీయురాలిగా కూడా గుర్తింపు కలిగి ఉన్నారు.
Also Read – ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కించేశారా?
అమెరికాలో ఇరుదేశాలకు చెందినవారితో బలమైన స్నేహ సంబంధాలు కలిగి ఉన్నారు. ఇది ఆమెకు ఎన్నికలలో చాలా కలిసివచ్చే అంశమే. కనుక ఆమె ఎన్నికల ప్రచారంలో ఇది కూడా ప్రస్తావిస్తూ దూసుకుపోతున్నారు.
ఆమెను ఎలా కట్టడిచేయాలో తెలియని డొనాల్డ్ ట్రంప్, ఇదివరకు ఎప్పుడో ఆమె చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ తన అమ్మమ్మ తాతయ్య, అత్తలతో చీరకట్టులో దిగిన ఫోటోని డొనాల్డ్ ట్రంప్ తన ‘ట్రూత్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, “చాలా ఏళ్ళ క్రితం ఇంత మంచి పంపినందుకు థాంక్స్ కమలా. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల, నువ్వు చూపిన ఈ ప్రేమాభిమానాలను అభినందిస్తున్నాను,” అంటూ వ్యంగ్యంగా మెసేజ్ పెట్టారు.
Also Read – ఇంతకీ షర్మిల బాణం గురి ఎవరివైపు?
ఆమె మూలాలు భారత్‌లో ఉంటే తాను నల్ల జాతీయురాలినని చెప్పుకుంటూ దేశంలో నల్లజాతి ప్రజలను మోసం చేస్తున్నారని ట్రంప్ చెప్పదలచుకున్నట్లు అర్దమవుతోంది.
అయితే ఆమె తల్లి తండ్రుల ద్వారా ఇరుదేశాల మూలాలు కలిగి ఉన్నారనే విషయం నల్లజాతీయులందరికీ తెలుసు. అమెరికాలోని తెల్ల, నల్లజాతీయులు వివిద దేశాలకు చెందినవారిని వివాహం చేసుకోవడం చాలా కామన్. కనుక కమలా హారిస్ భారత్ మూలాలు వారికేమీ అభ్యంతరం కాబోవు.
కానీ ఆమెను దెబ్బ తీసే ప్రయత్నంలో డొనాల్డ్ ట్రంప్ బయట పెట్టిన ఈ ఒక్క ఫోటోతో ఆమెకు భారత్‌తో ఇంత బలమైన అనుబందం కలిగి ఉన్నారనే విషయం స్వయంగా చాటింపు వేసిన్నట్లయింది. కనుక అమెరికాలో స్థిరపడిన భారతీయులలో కమలా హారిస్ భారతీయ మూలాల గురించి పూర్తిగా తెలియని వారికి కూడా డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తెలియజేసి వారందరి ఓట్లు ఆమెకే పడేలా చేశారని చెప్పవచ్చు. కనుక కమలా హారిస్ కూడా థాంక్యూ ట్రంప్ అని చెప్పుకోవాలేమో?