
అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అందరూ ఊహించిన్నట్లే తొలిరోజు నుంచే సంచనాలు సృష్టిస్తున్నారు.
Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?
విదేశాలకు, అమెరికాలో స్థిరపడిన విదేశీయులకు ఆయన నిర్ణయాలు కొత్త సమస్యలు తెచ్చిపెడతాయని అందరూ ఊహించిందే.
అమెరికా అధ్యక్షుడి తిరుగులేని అధికారాలను చాటి చెప్పే ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్’తోనే ఆయన మొదలుపెట్టేశారు. అమెరికా జన్మిస్తే అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే రాజ్యాంగంలోని సవరణని ట్రంప్ ఒక్క సంతకంతో రద్దు చేశారు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం జరిగిన అంతర్యుద్దం తర్వాత శరణార్ధుల పిల్లలకు ప్రాధమిక హక్కు కల్పించేందుకు చేసిన చట్ట సవరణ ఇప్పుడు అవసరం లేడని ట్రంప్ తేల్చి చెప్పేశారు.
ఈ చట్టంతో అర్హత లేనివారికి కూడా అమెరికన్ పౌరసత్వం కల్పిస్తుండటం వలన అమెరికాపై నానాటికీ భారం పెరిగిపోతుందని, కనుక దేశంలోకి అక్రమంగా వచ్చినవారికి అడ్డుకట్టవేయడానికి ఇది చాలా అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
దేశంలోకి అక్రమంగా వచ్చి ఈవిదంగా పౌరసత్వం పొందేవారిని ఏ ప్రభుత్వమూ అంగీకరించదు. కనుక ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకోలేము. ఆయన మనసులో వేరే ఆలోచన కూడా ఉంది.
దీనికి సంబందించి ఆయన సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, అమెరికాలో హెచ్-1బి తదితర వీసాలతో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకొని అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నవారికి కూడా ఒక్క సంతకంతో చెక్ పెట్టబోతున్నారు.
కాన్పు జరిగే సమయానికి ఆ శిశువు తల్లి లేదా తండ్రికి అమెరికన్ పౌరసత్వం లేన్నట్లయితే ఆ శిశువుకి జన్మతః అమెరికన్ పౌరసత్వం లభించదు.
ట్రంప్ అధ్యక్షుడైతే తప్పకుండా మళ్ళీ హెచ్-1బి తదితర వీసాల జారీపై కటినమైన ఆంక్షలు విధిస్తారని అందరికీ తెలుసు. కనుక హెచ్-1బి తదితర వీసాలతో వచ్చి అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయులతో సహా ఇతర దేశస్థులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయమని అర్దమవుతోంది.
అమెరికా ఈ స్థాయికి ఎదగడానికి లక్షలాది భారతీయులతో సహా అనేక దేశాల ప్రజల కృషి చాలా ఉంది. కనుక అగ్రరాజ్యంగా ఎదిగిన తర్వాత ఆ ఎదుగుదలకు తోడ్పడిన, ఇంకా తోడ్పడుతున్నవారూ ‘ఇక మాకు అవసరం లేదు. వారందరూ మాకు భారం..’ అంటూ వదిలించుకోవాలని ట్రంప్ అనుకోవడం ఎవరికైనా బాధ కలిగిస్తుంది.
కానీ ‘అమెరికా ఫస్ట్’ అని ట్రంప్ మొదటి నుంచే చెపుతున్నారు. తన ప్రాధాన్యత తన దేశం, తన ప్రజలు మాత్రమే అని విస్పష్టంగా చెపుతున్నారు.
అమెరికాని ప్రేమించే వ్యక్తిగా ఈ అభివృద్ది ఫలాలు తన దేశానికి, తన ప్రజలకు మాత్రమే దక్కాలని ఆయన కోరుకోవడం తప్పు కాదు.
కనుక మిగిలిన దేశాల సంగతి పక్కన పెడితే, భారత్ ఇంత వేగంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నా కూడా ఇంకా మనవాళ్లు అమెరికాలోనే స్థిరపడాలనుకోవడం, అమెరికాపైనే ఆధారపడాలనుకోవడం వలననే ట్రంప్ నిర్ణయాలు మనకి ఇబ్బందికరంగా కనిపిస్తుంటాయి.
అందుకే ప్రధాని మోడీ ‘ఆత్మ నిర్భర్ భారత్’, ‘మేకిన్ ఇండియా’ వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నారు. భారత్ ఎదుగుదలకు అవరోధంగా మారుతున్న రాజకీయాలు, అవినీతిని అధిగమించి అగ్ర రాజ్యంగా భారత్ నిలిచిన రోజున అమెరికాతో సహా అగ్రరాజ్యాల ప్రజలే భారత్‌లో ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చి భారత్-1 వీసాల కోసం, పౌరసత్వం కోసం క్యూ కడతారు. ఆ రోజు రావాలని అందరం కోరుకుందాము.