
డోనాల్డ్ ట్రంప్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్‌ల మద్య కాస్త సాపత్యం, కాస్త వైరుద్యాలున్నాయి. అవేమిటో చూద్దాం.
డోనాల్డ్ ట్రంప్‌కి అమెరికా అన్నా ఆమెరికన్స్ అన్నా వల్లమాలిన అభిమానం. అది ఆయన మాటలలో, చేతలలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. కానీ అది కాస్త అతిగా ఉంటుంది. అదే చాలా మందికి ‘జాతి వివక్ష’గా కూడా కనిపిస్తుంటుంది.
Also Read – ప్రభుత్వంపై ఆధారపడమంటారు జగన్.. వద్దంటారు చంద్రబాబు!
కేసీఆర్‌కి కూడా తెలంగాణ అంటే వల్లమాలిన అభిమానం. కానీ డోనాల్డ్ ట్రంప్‌లాగే ఆ అభిమానం ఇతరుల పాలిట శాపంగా మారుతుంది.
“తెలంగాణ రాష్ట్రాన్ని నేను పోరాడి సాధించుకున్నాను కనుక రాష్ట్రంలో నేను, నా పార్టీ తప్ప మరో పార్టీ ఉండకూడదు. మేము తప్ప మరొకరు అధికారంలో ఉండరాదు. ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది,” అని కేసీఆర్‌కి నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి.
Also Read – వివేకా హత్యతో సంబందం లేకపోతే భయం దేనికి?
కనుక ‘బంగారి తెలంగాణ’ పేరుతో కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి బిఆర్ఎస్ పార్టీకి ఎదురులేకుండా చేసుకున్నారు. డోనాల్డ్ ట్రంప్ కూడా అదేవిదంగా ‘అమెరికా ఫస్ట్’ పేరుతో సగటు ఆమెరికన్స్ హృదయాలు గెలుచుకొని డెమొక్రాట్ పార్టీని తెలివిగా దెబ్బ తీసి అధికారం చేజిక్కించుకున్నారు. కానీ కేసీఆర్‌లా అప్రజాస్వామ్యంగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్యబద్దంగానే డెమొక్రాట్ పార్టీని ఓడించి అధికారం దక్కించుకున్నారు.
ఇక డోనాల్డ్ ట్రంప్, జగన్ మద్య కొంత సాపత్యం, పూర్తి విరుద్దమైన లక్షణాలున్నాయి. ఇద్దరికీ జన్మతః చాలా తిక్క ఉంది కానీ దానికి ఏ లెక్కాలేదు.
Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?
జగన్ కూడా తిక్క ఉంది. అందుకే అమరావతిని పాడుబెట్టేసి, పోలవరానికి రివర్స్ గేర్ వేసి ఎక్కడి పనులు అక్కడ నిలిపి వేయించేశారు.
సువిశాలమైన భారతదేశానికి ఢిల్లీ ఒక్కటే రాజధానిగా ఉంటే, రెండు ముక్కలైన తర్వాత మరింత చిన్న రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్‌కి ‘ఒకటి సరిపోదు మూడు రాజధానులు అవసరమని’ తేల్చి చెప్పేశారు. దేవతా వస్త్రాల మాదిరిగానే కనిపించని ఆ మూడు రాజధానులతో 5 ఏళ్ళు ఇష్టారాజ్యం చేసి దిగిపోయారు.
డొనాల్డ్ ట్రంప్ దేశభక్తిని ఎవరూ శంకించలేరు. ‘ఏ దేశాలు ఎలా పోతే నాకెందుకు నా అమెరికా ఒక్కటీ బాగుంటే అంతే చాలు,” అనుకునే రకం ఆయన.
అందుకే ఇదివరకు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్నారు. ఇతర దేశాలను కాపాడేందుకు అమెరికన్ సైనికుల ప్రాణాలు ఎందుకు బలవ్వాలి?అమెరికన్లు కష్టపడి సంపాదించి డబ్బుతో కట్టిన పన్నులను ఇతర దేశాలకు పంచిపెట్టాల్సిన అవసరం ఏమిటి?అనే ఆయన ఆలోచనలో అమెరికా పట్ల ప్రేమానురాగాలు కనిపిస్తాయి.
అందువల్లే మళ్ళీ అధ్యక్షుడవగానే జన్మతః కుదరదు… వలసలు కుదరవు.. అంటూ చకచకా సంతకాలు పెట్టేశారు. ఆ సంతకాలలో కూడా అమెరికా పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలే కనబడుతున్నాయని భావించేవారు కోకొల్లలున్నారు.
తలతిక్క మనిషి దుందుడుకు స్వభావి అని అందరూ భావించే డోనాల్డ్ ట్రంప్‌కి తన దేశంపై ఇంత ప్రేమాభిమానాలు కనిపిస్తున్నాయి. కానీ ఆయన లాగే తిక్క మనిషిగా పేరొందిన జగన్‌కు అలాంటి సెంటిమెంట్స్ ఏవీ లేవు! ‘నేను అధికారంలో ఉండటం ఒక్కటే ముఖ్యం అందుకోసం ఏమైనా చేయొచ్చు’ అని గట్టిగా నమ్ముతారు.
అందుకే లక్షల కోట్లు అప్పులు తెచ్చి, రాష్ట్రంలో ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చి సంక్షేమ పధకాల పేరుతో వైసీపీకి ఓట్లు వేసే (40 శాతం) ప్రజలకి పంచిపెట్టేశారు. ఆ సొమ్ముని తిరిగి వారితో సహా మిగిలిన 60 శాతం ప్రజల నుంచి కూడా వసూలు చేసుకున్నారు.
మరో 5-10 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో అమ్ముడుపోయే మద్యం సేల్స్ కూడా చూపించి అప్పులు తీసుకున్నారు. అదీ సరిపోకపోతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము తీసి వాడేసుకున్నారు. కనుక వీరి ముగ్గురిలో ఎవరు బెటర్?మీరే చెప్పాలి.