Donald Trump Steps In

అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్‌-పాక్‌ యుద్ధ విరమణకు అంగీకరించాయని, ఈ నెల 12న ఇరు దేశాలు డీజీఎంఓలు సమావేశమై చర్చల ద్వారా సమస్యలని శాంతియుతంగా పరిష్కరించుకుంటారని డోనాల్డ్ ట్రంప్‌ మెసేజ్ పెట్టారు.

భారత్‌-పాక్‌ విదేశాంగ శాఖ కార్యదర్శులు కూడా దీనిని ధృవీకరిస్తూ శనివారం సాయంత్రం అధికారిక ప్రకటనలు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పులు విరమణ అమలులోకి వచ్చిందని భారత్‌ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ప్రకటించారు.

Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్‌ గారు?

కానీ మళ్ళీ ఆయనే శనివారం రాత్రి 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మళ్ళీ భారత్‌పై దాడులు చేస్తోందని, భారత్‌ వాటిని ధీటుగా ఎదుర్కొంటోందని చెప్పారు.

ట్రంప్‌ పెట్టిన ‘మధ్యవర్తిత్వ సందేశం’ ఇంకా సోషల్ మీడియాలో కనిపిస్తుండగానే, పాక్‌ మళ్ళీ భారత్‌పై దాడులు మొదలుపెట్టేసింది.

Also Read – వైసీపీ..బిఆర్ఎస్ ఇద్దరిది అరెస్టుల రాజకీయమేనా.?

కుక్క తోక వంకరని ఎవరూ సరిచేయలేనట్లే, పాక్‌ వక్ర బుద్ధిని కూడా ఎవరూ, ఎన్నటికీ సరిచేయలేరని పాక్‌ మరోసారి నిరూపించి ట్రంప్‌కి కూడా చూపింది.

కానీ ముందుగా భారత్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమపై దాడి చేసినందునే, ఎదురు దాడి చేస్తున్నామని పాక్‌ వాదించడం ఖాయం.

Also Read – రేపు రెంటపాలకు జగన్‌.. ఏం ప్లాన్ చేశారో?

ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్య విషయం మరొకటి ఉంది. భారత్‌ త్రివిధ దళాలు ప్రభుత్వం అధీనంలో పనిచేస్తుంటాయి. దాని ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాయని యావత్ ప్రపంచానికి తెలుసు.

కానీ పాక్‌ ప్రభుత్వం నిన్న కాల్పుల విరమణ ప్రకటన చేసిన తర్వాత, పాక్‌ దళాలు భారత్‌పై దాడులు చేశాయంటే అర్ధం, పాక్‌ ప్రభుత్వం చేతిలో పాక్‌ సైన్యం లేదని! పాక్‌ ప్రభుత్వ ఆదేశాలను అది పాటించదని స్పష్టమవుతోంది.

పాక్‌ సైన్యాధికారులు, పాక్‌ నిఘా సంస్థ ఐఎస్ఐ అధికారులు, ఉగ్రవాదులు భారత్‌పై అణ్వస్త్రాలతో దాడిచేసి ప్రపంచ పటం నుంచి భారత్‌ని తుడిచిపెట్టేయాలని తహతహలాడుతున్నారు.

కనుక ట్రంప్‌ లేదా మరొకరో చెప్పారని యుద్ధం ఆపేస్తామంటే వారు అంగీకరించారు.. ఆగిపోరు. ప్రభుత్వ ఆదేశాన్ని ధిక్కరించి భారత్‌పై దాడులు చేస్తున్నందున తమపై ప్రభుత్వం చర్యలు తీసుకునేలోగానే వారు పాక్‌లో సైనిక తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి కూడా వారు వెనుకాడకపోవచ్చు. బహుశః ఇప్పటికే పాక్‌ సైన్యం ప్రభుత్వాన్ని తన అధీనంలో తీసుకొని ఉన్నా ఆశ్చర్యం లేదు.




కనుక ట్రంప్‌ మంత్ర దండం తిప్పి భారత్‌ని ఆపగలిగారు కానీ పాక్‌ని కాదు. ఇప్పుడు ఆయన ఏవిదంగా స్పందిస్తారో?