
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందరిలా ఆలోచించే వ్యక్తి కాదు. అందుకే ఆయన నిర్ణయాలు అంత భిన్నంగా ఉంటాయి. ‘జన్మతః’ అంటూ విదేశీయులకు మొదటి షాక్ ఇచ్చిన ట్రంప్, ఈసారి భారత్‌తో సహా ప్రపంచదేశాలకు మరింత పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు చెప్పేశారు.
ఆమెరికన్లకి ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. అమెరికన్ పౌరుల కనీసం అవసరాలు అంటే ఇంటి అద్దెలు, వాహనాల నిర్వహణ ఖర్చులు, బ్యాంకుల ఈఎంఐలు వగైరా ఖర్చులన్నీపోగా మిగిలే ఆదాయాన్ని మరింత పెంచి, ధనవంతులుగా మారేందుకు వీలుగా దేశ ఆర్ధికవిధానాలలో, పన్ను విధానాలలో భారీగా సంస్కరణలు చేపట్టబోతున్నానని చెప్పారు.
Also Read – అందరికీ ఓ రెడ్‌బుక్ కావాలి.. తప్పు కాదా?
భారత్‌లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలైతే “ఈసారి ఆదాయ పన్ను పరిమితిని రూ.5,7, 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. పెంచాలని ప్రజలు కోరుకుంటున్నారు,” అంటూ పత్రికలలో వార్తలు వస్తుంటాయి. అంటే ఆదాయపన్ను చెల్లించేందుకు ప్రజలు సిద్దంగానే ఉన్నారు. కానీ ఆ పరిమితిని మరికాస్త పెంచి ఉపశమనం కలిగిస్తే చాలని కోరుకుంటున్నట్లు అర్దమవుతోంది.
కానీ డోనాల్డ్ ట్రంప్ తన దేశపౌరులకి ఆదాయ పన్ను నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు! వారికి పన్ను మినహాయింపు ఇస్తే అమెరికా ప్రభుత్వం భారీగా ఆదాయం కోల్పోతుంది. కనుక ఆ భారం ప్రపంచదేశాలపై వేయాలని ట్రంప్ ఆలోచిస్తున్నారు.
Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…
ఇప్పటికే కెనడా దిగుమతులపై భారీగా పన్ను విదిస్తామని ట్రంప్ ప్రకటించడంతో ఆ రెండు దేశాల మద్య వాణిజ్య యుద్ధాలు మొదలబోతున్నాయి.
భారత్, చైనా, పాకిస్థాన్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, యూరోపియన్ దేశాల నుంచి అమెరికాకు భారీగా వివిద ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. భారత్ వంటి అనేక దేశాలు అమెరికాలో బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, వైద్య, ఆర్ధిక, రవాణా, వాణిజ్య సంస్థలకు ఐటి సేవలు (ఐటి ఎగుమతులు) అందిస్తుంటాయి.
Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?
ట్రంప్ నిర్ణయంతో అమెరికా ప్రభుత్వానికి తగ్గే ఆదాయాన్ని, పడే అదనపు భారాన్ని ఎగుమతులపై పెంచబోయే పన్నుల రూపంలో చెల్లిస్తూ ప్రపంచదేశాలే భరించాల్సి ఉంటుంది. కనుక భారత్‌తో సహా అన్ని దేశాలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ట్రంప్ నిర్ణయం వలన భారత్‌తో సహా వివిద దేశాలలో కంపెనీలపై ఆర్ధిక భారం, దాంతో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ భారం తగ్గించుకోవడానికి ముందుగా ఉద్యోగాలను తగ్గించుకునేందుకు ప్రయత్నించడం ఖాయం. కనుక ట్రంప్ నిర్ణయం అమలుచేస్తే భారత్‌లో పలువురు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.
ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవగానే ఉలిక్కి పడుతున్న ప్రపంచదేశాలకు ఆయన ఇటువంటి నిర్ణయాలతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇంతకాలం పలు దేశాలను సాకిన అమెరికాని, ఇప్పుడు ప్రపంచదేశాలు సాకాలని ట్రంప్ కోరుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.