BJP JanaSena TDP alliance Double Engine Government

బీజేపి తరచూ డబుల్ ఇంజన్ సర్కార్ అంటుంది. ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టేందుకు ఏదో చెపుతుంటుందని చాలా మంది భావిస్తుంటారు.

Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?

కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేనలు, ఇక్కడ ఏపీలో కూటమి ప్రభుత్వంలో వాటితో బీజేపి భాగస్వామిగా ఉంది. కనుక ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏవిదంగా పనిచేస్తుందో ఏపీకి కేంద్రం మంజూరు చేస్తున్న నిధులు, ప్రాజెక్టులు చూస్తే అర్దమవుతుంది.

కేవలం ఈ ఏడు నెలల్లోనే ఏపీకి సుమారు 4 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు, అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు దశలవారీగా నిధులు విడుదల చేస్తోంది.

Also Read – జగన్‌ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?

తాజాగా చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీకి 10 చేనేత క్లస్టర్స్ ఏర్పాటుకి నిధులు విడుదల చేస్తోంది.

రాష్ట్రంలో సుమారు 3.50 లక్షల మంది చేనేత కార్మికులున్నారు. వారికి ఆధునిక యంత్ర పరికరాలు అందించి, నేటి అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్స్ నేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించబోతోంది.

Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే

ఒక్కో క్లస్టర్లో 100-500 మందితో ఏర్పాటు చేసి వారికి రూ.2 కోట్లు చొప్పున కేంద్రం నిధులు అందిస్తుంది. ఒక్కో చేనేత కార్మికుడికి సుమారు రూ.15-70,000 వరకు ఆర్ధిక సాయం లభిస్తుంది. అంతే కాదు.. వర్క్ షాపుల నిర్మాణానికి 100 శాతం రాయితీ, మగ్గం వగైరా యంత్ర పరికరాలపై 90 శాతం రాయితీ కూడా ఇస్తుంది.

ఏపీలో ఏర్పాటు కాబోయే చేనేత క్లస్టర్స్: మంగళగిరి-1 (గుంటూరు), శ్రీ త్రికోటేశ్వర (బాపట్ల), చిలకలూరిపేట (పల్నాడు), నారాయణవనం (తిరుపతి), శ్రీకాళహస్తి (తిరుపతి), చింతల వెంకట రమణస్వామి (అనంతపురం), హిందూపురం (శ్రీ సత్యసాయి), పాతూరు (నెల్లూరు), పెద్దాపురం (కాకినాడ), వడిశలూరు (తూర్పు గోదావరి)

ఇవి కాక ధర్మవరంలో రూ.34 కోట్లతో కంచి పట్టుచీరల మెగా క్లస్టర్, రూ.14 కోట్లతో పిఠాపురం, అంగరలో మెగా క్లస్టర్స్ ఏర్పాటు చేయబోతోంది. వీటికి కేంద్రం 90 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులు కేటాయిస్తాయి.

చేనేత కార్మికులకు ఈవిదంగా సాయపడటం చాలా అభినందనీయం. అయితే వారు తయారుచేసే చేనేత వస్త్రాల అమ్మకాలకు బలమైన మార్కెటింగ్ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే వారు కూడా గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్న రైతుల మాదిరిగా మిగిలిపోతారు.




తెలంగాణలో కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఆదాయం లభించేలా చేయడం కోసం బతుకమ్మ చీరల నేసే బాధ్యతని వారికి అప్పగించారు. ఏపీలో చేనేత కార్మికులకి కూడా కూటమి ప్రభుత్వం అటువంటి ఆదాయ మార్గం సృష్టించాలి. అప్పుడే ఈ చేనేత రంగానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది.