ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచేసి, ఇంటిపన్ను, చెత్తపన్నులతో ప్రజలపై భారం మోపుతుండటాన్ని నిరసిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు నేటికీ పట్టుదలగా కొనసాగిస్తుండటం విశేషం.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి, బెల్లంకొండలో టిడిపి నేతలు, కార్యకర్తలు కలిసి మంగళవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు అధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని 14వ వార్డులో, టిడిపి సీనియర్ నేత డాక్టర్ కోడెల శివరాం నేతృత్వంలో 26,27,28,29 వార్డులలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
14వ వార్డులో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి చౌటా శ్రీనివాసరావు, కౌన్సిలర్ కటకం రామకృష్ణ, టిడిపి కార్యకర్తలు జానీభాషా, కంబంపాటి అబ్రహం, జువ్వాజీ రామ్మోహనరావు, వెంకట్రావు, మారెళ్ల మల్లేశ్వర రావు, కొబ్బరి సుబ్బారావు, లోకేశ్వరరావు, జానీబాబు, పోట్ల ఆంజనేయులు, ఆళ్ళ సాంబయ్య, బత్తుల చంద్రశేఖర్, సీతయ్య, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని 26, 27, 28, 29 వార్డులలో జరిగిన నిరసన కార్యక్రమంలో టిడిపి నాయకులు సయ్యద్ పెదకరీముల్లా ఆతుకూరి నాగేశ్వరరావు, మస్తాన్ వలీ, జానీభాషా, జాన్‌బాబు, పూజల వెంకట కోటయ్య, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
మంగళవారం బెల్లంకొండ మండలంలోని వెంకటాయపాలెంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో బెల్లంకొండ సర్పంచ్ జి జ్యోతి సముద్రం, వెంకటాయపాలెం ఉప సర్పంచ్ శ్రీను నాయక్, మాజీ సర్పంచ్ ఎం శ్రీరామమూర్తి, మండల బీసీ సెల్ అధ్యక్షులు జి గంగాధర్ రావు, పార్లమెంట్ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఓర్చు ఆనంద్ టిడిపి కార్యకర్తలు సయ్యద్ జానీ, వెన్నా సీతారామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పిచ్చిరెడ్డి కిచ్చారెడ్డి, పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పధకాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకొంటూ, మరోవైపు ఛార్జీలు, పన్నులు పెంచేస్తూ సామాన్య ప్రజల జీవితాలు దుర్భరం చేస్తోందని టిడిపి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం ఏవిదంగా ప్రజలను మభ్యపెట్టి భారం వేస్తోందో తెలియజేస్తూ కరపత్రాలను వార్డులలో ప్రజలందరికీ పంచారు.



