Eatala Rajender on PM Narendra Modi

టీడీపీ, వైసీపీలు అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ పార్టీల నేతలు తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టడానికి ఇష్టపడేవారు కారు. కానీ తెలంగాణలో కేసీఆర్‌తో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు, ఏపీ రాజకీయాలు, పాలకులు, పాలనపై అవాకులు చవాకులు వాగుతూనే ఉంటారు.

కేసీఆర్‌ శిక్షణలో బిఆర్ఎస్ పార్టీ నేతలందరి నోళ్ళు చాలా పదునెక్కాయి. ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయినా ఆ పదును ఇంకా అలాగే ఉంది. సిఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలను ఏపీకి తరలించుకుపోతున్నారని ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త రాగం ఆలపిస్తుందటమే ఇందుకు తాజా ఉదాహరణ.

Also Read – ఒకరిది భాషోద్వేగం..మరొకరిది ప్రాంతీయవాదం..మరి ఏపీ.?

తెలంగాణ రాజకీయాలకు ఏపీ అధికార, ప్రతిపక్షాల నేతలు దూరంగా ఉన్నప్పటికీ ఏదో సందర్భంలో తెలంగాణ రాజకీయ నాయకులు ఏపీ గురించి మాట్లాడుతూనే ఉంటారు.

తెలంగాణ బీజేపి ఎంపీ ఈటల రాజేందర్‌ ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ, “ప్రధాని మోడీతో పెట్టుకుంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద మనుషులకు ఏ గతి పట్టిందో అందరూ చూశారు. ఇక్కడ కేసీఆర్‌కి ఏగతి పట్టిందో అందరూ చూశారు. కనుక ప్రధాని మోడీని విమర్శిస్తున్న రేవంత్ రెడ్డికి కూడా రేపు అదే గతి పట్టబోతోంది,” అని హెచ్చరించారు.

Also Read – అయ్యో! మన హిస్టరీ అంతా అలా చెప్పేస్తున్నారేమిటి?

ఈటల రాజేందర్‌ మాటలు చాలా చేదుగా.. ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఎటువంటివారో ఆయనే చెప్పేశారు.

ఈటల రాజేందర్‌ తాను ప్రధాని మోడీ శక్తి సామర్ధ్యాలు గురించి వివరిస్తున్నానని అనుకుంటూ, మోడీని వ్యతిరేకిస్తే దేశంలో ఏ ముఖ్యమంత్రి మనుగడ సాగించలేడని వాస్తవం చెప్పేశారు. అంటే అరవింద్‌ కేజ్రీవాల్‌ తర్వాత రేవంత్ రెడ్డికి ఎసరు సిద్దమవుతోందని ప్రకటించేశారనుకోవచ్చు. కానీ ప్రధాని మోడీ గురించి ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ ఈవిదంగా మాట్లాడటం ఆశ్చర్యంగానే ఉంది… కదా?

Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?