Education Reforms in Andhra Pradesh

జగన్‌ హయంలో విద్య సంస్కరణల పేరుతో జరిగిన ప్రయోగాలతో 5 ఏళ్ళ విద్యావ్యవస్థ చిన్నా భిన్నం అయిపోయింది. ఐదేళ్ళపాటు ఉపాధ్యాయులు, విద్యార్ధులు, వారి తల్లి తండ్రులు కూడా నరకం అనుభవించారు.

వాటిలో ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్‌లు, ఆన్‌లైన్‌ పాఠాలు, పాఠ్య పుస్తకాలపై జగన్‌ బొమ్మలు, గోరుముద్దలో వైసీపీ ముద్రలు ఒకటా.. రెండా?

Also Read – రష్మిక నక్క తోక తొక్కారా.?

పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు కనీసం నెలనెలా జీతాలు చెల్లించకపోగా వారిని ఎంతగానో వేధించింది జగన్‌ ప్రభుత్వం. వైసీపీ ఘోర పరాజయానికి విద్యా వ్యవస్థపై చేసిన ఈ ఆరాచకాలు కూడా ఓ కారణమేనని అందరికీ తెలుసు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నారా లోకేష్‌ ఏరికోరి విద్యాశాఖని ఎంపిక చేసుకొని, జగన్‌ సృష్టించిన సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించారు.

Also Read – మధురైకి పవన్ కళ్యాణ్‌… అందరూ రెడీయేనా?

ఇప్పటికే 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరిచేలోగా ఈ మెగా డీఎస్సీ భర్తీ ప్రక్రియని పూర్తి చేయాలని గడువు కూడా పెట్టుకొని మరీ ముందుకు సాగుతోంది రాష్ట్ర ప్రభుత్వం.

సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖకు సంబందించిన మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read – అది ప్రమాదమట.. కేసు నమోదు చేయడం కుట్రట!

వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది దివ్యాంగ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నియమకానికి ఆమోద ముద్ర వేయడం.

ప్రభుత్వ పాఠశాలలో పీటీలు కనిపిస్తారు కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కనిపించరు. ఈ కారణంగా నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యాంగ విద్యార్ధులు చదువులకు దూరంగా ఉండిపోవలసి వస్తోంది. ఇప్పుడు వారికి కూడా ఇతర పిల్లలతో సమానంగా రాణించేందుకు ఈ నిర్ణయం చాలా తోడ్పడుతుంది.

విద్యార్ధులు పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతించారు. ఇది కూడా చాలా మంచి నిర్ణయం. దీని వలన రాష్ట్రంలో నిరుపేద విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ లభిస్తుంది. ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడగలుగుతారు.




సంస్కరణలు, నిర్ణయాల వలన సత్ఫలితాలు కనిపించాలి తప్ప దుష్పరిణామాలు కాదు కదా? జగన్‌, చంద్రబాబు నాయుడు పాలనలో తేడా ఇదే!