
నాడు..నేడు అంటూ వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళన, విద్యా వ్యవస్థలో నూతన శకం అంటూ ప్రచారం చేసుకున్న జగన్ తానూ పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనేలా వ్యవహరించారు.
వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన బై జ్యూస్ విద్యాభాసం మీద ఎన్నో విమర్శలు ఎదురైనా, ఇంగ్లీష్ మీడియం విద్యా అంటూ సరైన అవగాహనా లేని ఉపాధ్యాయులతో చదువులు బోధిస్తున్నారు అనే ఆరోపణలు ఎదురైనా ఎక్కడా వాటి పై పునరాలోచన చేయకుండా, విద్యార్థుల తల్లి తండ్రుల అభిప్రాయానికి విలువివ్వకుండా అధికారులు ప్రభుత్వ పెద్దల నిర్ణయాన్ని అమలు చేసి తీరారు.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
దీనితో ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. అలాగే నాడు భావితరం భవిష్యత్ కన్నా వైసీపీ భవిష్యత్ మీదే ఎక్కవ శ్రద్ధ పెట్టిన జగన్ పిల్లలకు అందించే ప్రతి వస్తువు మీద చివరికి వారు ధరించే బెల్ట్ మీద, వారు చదువుకునే పాఠ్య పుస్తకాల మీద కూడా జగన్ బొమ్మను ముద్రించి ప్రచారం చేసుకున్నారు.
అయితే ఇప్పుడు అధికారంలోకి ఉన్న కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థలో పేరుకుపోయిన అనేక సమస్యల ప్రక్షాళనకు, విద్యార్థుల మీద ఉన్న చదువు ఒత్తిడిలను నిర్ములించడానికి అనేక అమర్పులకు శ్రీకారం చుట్టింది. చదువు అనేది విద్యార్థుల ప్రాథమిక హక్కు అయితే వారికీ సరైన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ విధి అనేలా ముందుగా పాఠ్యపుస్తకాల మీద ప్రభుత్వ పెద్దల బొమ్మల ముద్రణను తొలగించారు మంత్రి లోకేష్.
Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?
అలాగే వారికీ చదువుల ఒత్తిడిని తగ్గించే ప్రక్రియలో భాగంగా ప్రతి శనివారం ‘నో బాగ్ డే’ అనే నూతన సంస్కరణను ప్రవేశ పెట్టింది. దీనితో వారంలో కనీసం ఒక్కరోజైనా విద్యా సంస్థలు పిల్లల అభిరుచికి తగ్గట్టుగా వారి వారి ప్రతిభాపాఠవాలను బయటకు తీసే అవకాశం కనిపిస్తుంది. నిత్యం చదువులేనా అన్న తీరు కాకుండా క్రీడల మీద ఇతర అవగాహనా తరగతుల మీద లేక వారి నైపుణ్యం మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టె అవకాశం ఉంది.
విద్యా శాఖ మంత్రిగా లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు విద్యార్థులే కాదు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంటర్ మొదటి సంవత్స పరీక్షలు రద్దు చేసి పిల్లలకు పరీక్షా ఒత్తిడిని తగ్గించాలని తీసుకొచ్చిన ప్రతిపాదన మీద కూడా విద్యార్థుల తల్లితండ్రుల అభిప్రాయం, ఉపాధ్యాయుల ఆలోచనలు పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకుంది.
Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే
ఈ విధమైన ప్రతిపాదన విద్యార్థులలో ఒత్తిడిని తగ్గించడం కాదు నిర్లక్ష్యాన్ని పెంచుతుంది అనే భావన సర్వత్రా వ్యక్తం చేయడంతో కూటమి ప్రభుత్వం తానూ చెప్పిందే జరగాలి అనే మొండి పట్టుదలకు పోకుండా విద్యార్థుల భవిష్యత్ కు ఏది సరైన నిర్ణయమో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అంటూ ప్రకటించి ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులకు యదావిధిగా ఇంటర్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడే ఫైనల్ పరీక్షలను కొనసాగించనుంది.
దీనితో నాటి వైసీపీ ప్రభుత్వానికి నేటి కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అటు పెద్దలే కాదు ఇటు పిల్లలు కూడా స్పష్టంగా చూడగలుగుతున్నారు. ఇక్కడ విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న లోకేష్ తన నిర్ణయాల అమలు కంటే కూడా విద్యార్థుల భవిష్యత్తే తనకు ముఖ్యమని అటు అందరి అభిప్రాయాలకు విలువనిచ్చి నాడు…నేడు కి సరైన అర్దాన్ని తెలియచేసారు.