‘అరవింద సమేత’ సినిమా ప్రమోషన్స్ లో వేగం పుంజుకుంది. ఇప్పటివరకు స్తబ్దుగా సాగిన ప్రమోషన్ కార్యక్రమాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. రేపు ఫుల్ ఆడియో విడుదల కానున్న నేపధ్యంలో…. పబ్లిసిటీ అంతా ఎస్.ఎస్.థమన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ల చుట్టూనే తిరుగుతోంది. అలాగే పాటల్లో కనిపిస్తోన్న హీరోయిన్ పూజా హెగ్డే అక్కడక్కడ తళుక్కుమంటోంది.
బహుశా తనపై ఫోకస్ సరిగా లేదని అనుకుందో ఏమో గానీ, ఈ సినిమాలో తాను కూడా ఉన్నాను అన్న భావనను ప్రేక్షకులకు తెలియజెప్పేలా తాజాగా ఓ సెల్ఫీ స్టిల్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తెలుగు హీరోయిన్ ఈషా రబ్బా. జూనియర్ ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కూడిన ఈ పిక్ ను పోస్ట్ చేస్తూ… చాలా కూలేస్ట్ పీపుల్ తో సెట్స్ పై ఉన్నానంటూ తెలిపింది.
ADVERTISEMENT
[m9ad]
ADVERTISEMENT



