‘ఫేక్ హామీ’లు ఇస్తున్న రాజకీయ పార్టీలకు ‘ఈసీ చెక్’

Election Commission Of India - Manifesto Promisesరాజకీయ పార్టీల గుండెల్లో గుబులు పుట్టించే నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఓటర్లను ఆకర్షించేందుకు అడ్డదిడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని నెరవేర్చని పార్టీల గుర్తును రద్దు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడాన్ని అడ్డుకునేందుకే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 2017లో పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మేనిఫెస్టోను ఈసీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. మేనిఫెస్టో హామీలను నెరవేర్చని పక్షంలో సదరు పార్టీపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ADVERTISEMENT

మొదట మేనిఫెస్టోలోని హామీలు అమలు చేస్తామంటూ ఎన్నికల సంఘానికి పార్టీలు ఓ స్టాంప్ పేపర్‌ పై అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. వాటిని నెరవేర్చడంలో సదరు పార్టీ విఫలమైతే పార్టీ అధికారిక చిహ్నాన్ని రద్దు చేయాలని ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 23న జరిగిన సమావేశంలో ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

తాము అధికారంలోకి వస్తే 12వ తరగతి విద్యార్థులకు ల్యాప్‌ టాప్‌ లు అందిస్తామని 2012లో శిరోమణి అకాలీ దళ్ హామీ ఇచ్చి పంజాబ్‌లో గద్దెనెక్కింది. అయితే ఆ తర్వాత ఈ హామీ విషయంలో వెనక్కి తగ్గింది. ల్యాప్‌ టాప్‌ ల కోసం 1.25 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో హామీని గంగలో కలిపేసింది. దీంతో ఇటువంటి హామీలకు చెక్ పెట్టేందుకు నడుం బిగించిన ఈసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

ADVERTISEMENT
Latest Stories