బాదుడే బాదుడు… అయినా అప్పులు, నష్టాలేనా.. ఎలా?

Electricity Dept in Debts and Losses in Jagan Govt

గత 5 ఏళ్ళుగా జగన్‌ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెంచుతూనే ఉండేది. నేరుగా పెంచలేకపోతే ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో పిండుకునేది.

అయినప్పటికీ 2024 నవంబర్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు రూ. 71,762 కోట్ల అప్పులు, మరో రూ.29,377 కోట్ల నష్టాలు వచ్చాయని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి తాజా నివేదికలో పేర్కొంది. ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నా విద్యుత్ సంస్థలకు సుమారు లక్ష కోట్లు అప్పులు, నష్టం వచ్చింది. ఎందుకు? ఎవరు బాధ్యులు? అనే ప్రశ్నకు సమాధానం దొరకదు.

ADVERTISEMENT

కానీ జగన్‌ హయాంలో జరిగిన అవినీతి దీనికి ప్రధాన కారణాలలో ఒకటి అని భావించక తప్పదు. అదానీ గ్రూప్ ఉత్పత్తి చేయబోయే సౌర విద్యుత్‌ని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ద్వారా అధిక ధరలకు కొనుగోలు చేసేందుకుగాను అదానీ గ్రూప్ జగన్‌కు రూ.1,750 కోట్లు కమీషన్ ముట్టజెప్పిందని పత్రికలలో వార్తలు వచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

అవి రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టి పడేసీనా అమెరికా కోర్టులో దీని గురించి అదానీ గ్రూప్‌పై కేసు కూడా నమోదు అయ్యింది. కనుక కమీషన్లు నిజమే అని నమ్మక తప్పదు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వాధినేతలే ఈవిదంగా చేస్తే విద్యుత్ సంస్థలకు అప్పులు, నష్టాలు రాకుండా ఉంటాయా?

రాబోయే 25 ఏళ్ళు విద్యుత్ సరఫరా చేసేందుకు జగన్‌ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఆ ముందస్తు ఒప్పందం వలన రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల భారం పడబోతోందని సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్పారు కూడా. అయినప్పటికీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉందని, చేసుకుంటే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

కనుక విద్యుత్ సంస్థలు ఎప్పటికప్పుడు ఛార్జీలు పెంచుతూ ప్రజలపై ఆ భారం మోపుతుండటమే కాక పాలకుల తప్పుడు నిర్ణయాల వలన, కమీషన్ల కక్కుర్తి వలన కూడా ప్రజాలపి భారం పడుతోందని స్పష్టమవుతోంది. జగన్‌ నిర్వాకల వలన అటు విద్యుత్ సంస్థలు, ఇటు ప్రజలు కూడా నష్టపోతుండటం చాలా బాధాకరం.

ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విద్యుత్ సంస్థలు ప్రజల నుంచి రూ.14,683 కోట్లు వసూలు చేసుకోవడానికి విద్యుత్ నియంత్రణ మండలి మొదట ఆమోదం తెలిపినప్పటికీ, కూటమి ప్రభుత్వం ఆ భారం భరించేందుకు సిద్దపడటంతో విద్యుత్ చార్జీల పెంపు ఉండదు.

ప్రభుత్వం కూడా ఈ భారం తగ్గించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని నిర్ణయించింది.

రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కంటే ప్రధాన మంత్రి కుసుమ్ పధకం కింద సౌర విద్యుత్‌తో పనిచేసే 4 లక్షల వ్యవసాయ పంప్ సెట్స్‌ సమకూర్చడం వలన మరికొంత భారం తగ్గించుకోవచ్చని నిర్ణయించింది.

జగన్‌ ప్రతీ వ్యవస్థను ధ్వంసం చేస్తే సిఎం చంద్రబాబు నాయుడు ప్రతీ వ్యవస్థని మళ్ళీ ఈవిదంగా గాడిన పెట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories