బాలీవుడ్ హీరోకు మాతృవియోగం!

emraan hashmi's mother expiredప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి తల్లి మహేరా హష్మి కాలం చేసారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న మహేరా శుక్రవారం రాత్రి సమయంలో తుది శ్వాస విడిచినట్లుగా సన్నిహిత వర్గాల సమాచారం.

ముంబయిలోని హిందూజా ఆసుపత్రిలో కన్నుమూసిన మహేరా హష్మీ భౌతిక కాయానికి ఆదివారం నాడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇమ్రాన్ హష్మి ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం రొమానియా పర్యటనలో ఉండగా, తల్లి మరణ వార్త తెలియడంతో భారత్ కు బయలుదేరినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories