ఎవరు టీజర్: ఉత్కంఠభరితమైన మిస్టరీ

EVARU-Theatrical-Trailer talkఅడివి శేష్‌, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎవరు’ ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ ఈరోజు ఉదయం విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగే కథ, కథనాలతో సినిమా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. రెజినా ఒక వ్యక్తిని (నవీన్ చంద్ర) ను చంపింది అనే ఆరోపణలను ఎదురుకుంటుంది. ఆమె ఏమో అతను తనను మానభంగం చెయ్యడానికి ప్రయత్నించాడని ఆరోపిస్తుంది.

అసలు ఏం జరిగింది అనే విషయాన్నీ తెలుసుకోవడానికి అవినీతిపరుడైన వాసుదేవ్ ను డిపార్టుమెంటు నియమిస్తుంది. అసలు ఏం జరిగింది అనేదే కథ. ట్రైలర్ లోని విజువల్స్ అదిరిపోయాయి. నేపధ్య సంగీతం మన నేటివిటీకి తగ్గట్టుగా ఉంటే మరింత ఆకట్టుకునేలా ఉండేది. మొత్తానికి ట్రైలర్ సినిమాకు మంచి హైప్ తెస్తుంది అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఆగస్టు 15న విడుదలైయ్యే శర్వానంద్ రణరంగం సినిమాకు ఎవరు గట్టి పోటీ అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT

‘క్షణం’ ‘గూఢచారి’ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకున్న అడివి శేష్ ఈ సినిమా హిట్ అయితే తరువాతి రేంజ్ కు వెళ్తాడు. వెంకట్ రామ్‌జీ డైరెక్ట్ చేసిని ఈ సినిమాను పీవీపీ బ్యానర్‌లో తెరకెక్కింది. కొత్త తరహా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు కాబట్టి హిట్ కొడతామన్న ధీమాతో ఉన్నాడు అడవి శేష్. చూడాలి ఏం జరగబోతుందో

ADVERTISEMENT
Latest Stories