2019 లో అనూహ్య మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ యువ నాయకత్వంతో, ప్రజలలో తన తండ్రి వైస్సార్ కు ఉన్నా ఛరిష్మాలతో రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకువెళుతుంది అని ఆశ పడ్డ ఏపీ ప్రజానీకానికి మూడు ముక్కలాట చూపించారు జగన్. అలాగే బూతులను రాష్ట్ర అధికారిక భాషగా మార్చేసింది వైసీపీ ప్రభుత్వం.
151 సీట్లతో అధికారాన్ని ఇచ్చించి ప్రజల పై పన్నుల భారం వేయడానికి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడానికి, రాజధానిని కూల్చడానికి, ప్రతిపక్ష పార్టీలను కేసులతో వేదించడానికే అన్నట్టుగా పాలన మొదలు పెట్టిన వైసీపీ చివరి వరకు అదే సిద్దాంతానికి కట్టుబడి పని చేసింది. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు అల్లాడుతున్నారు అన్నా, ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నా , రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తినా ఇక వారిని బహిరంగంగా మీడియా ముందుకు పచ్చి వచ్చి బూతులు తిట్టడం, వారి కుటుంబంలోని మహిళలను దూషించడం వైసీపీ నాయకులకు ఆనవాయితీగా మారిపోయింది.
మద్యపాన నిషేధం అన్నారు మరి ప్రభుత్వమే మద్యం అమ్ముతున్నారు అని ప్రశ్నిస్తే నీకు మూడు పెళ్లిళ్లు, నాలుగు పెళ్ళాలు అంటూ లేని మరో భార్యను తెచ్చి పవన్ వ్యక్తిగత జీవితాన్ని బజారుకీడ్చడం, అమరావతి రాజధానికి వైసీపీ మద్దతు తెలిపి ఇప్పుడు మాట మార్చడం అన్యాయం అంటూ నిలదీసిన చంద్రబాబు ను బూతులు తిట్టడం, ఆయన భార్యను అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేయడం వైసీపీ పైత్యానికి పరాకాష్ట.
సన్న బియ్యం ఇస్తానన్నారు ఆ హామీ ఎప్పుడు నిలబెట్టుకుంటారు అంటే సన్న బియ్యం నీ …….ఇస్తాడు అంటూ తెలుగు భాషలో ఉన్న బూతులన్నీ వాడారు మంత్రి కొడాలినాని. ఇలా ప్రజా గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిసారి ప్రతిపక్షాలకు బూతులతో బదులిచ్చేది రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్…ఇలా చాలామందే ఉన్నారు.
ప్రజలు ఐదేళ్లు తమకిచ్చిన సువర్ణ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి మీద పెట్టకుండా తెలుగు భాషకు తెగులు పట్టించే పనిలో పడ్డారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన తరువాత నుంచి ఇన్నాళ్లు నోటికి మాత్రమే పని చెప్పిన ఈ నాయకులు ఇప్పుడు చెవులకు మాత్రమే పని చెపుతున్నారు. ఇప్పటికే గుడివాడ రౌడీ గా పేరు పొందిన కొడాలి నాని మీడియా కంటికి కనపడనంత దూరంగా ఉండి పోయారు.
ఇక రోజా తన స్వరంలో దూకుడు తగ్గించింది. పేర్ని నాని తమ ముఖంలోనే ఓటమిని అంగీకరించినట్టు స్పష్టంగా చూపిస్తున్నారు. అంబటి రాంబాబు ఇక చేయగలిగింది ఏమి లేదు మా చెయ్యి దాటి పోయింది అంటూ తలవంచే పరిస్థితికి వచ్చారు. అనిల్ కుమార్ యాదవ్ మాటలలో కూడా తడబాటు ఓటమి భయం స్పషంగా కనిపిస్తుంది. ఇన్నాళ్లు అధికారం ఉంది అనే అహంతో, అహంకారంతో తమ స్థాయి మరిచి, స్థాయికి మించి విమర్శలు చేసిన ఈ నోర్లు ఇప్పటికే ఒక్కక్కటిగా మూసుకుంటున్నాయి.
ఇక జూన్ 4 తరువాత మరికొన్ని నోర్లు మూసుకునే అవకాశం కనపడుతుంది.ఒక సినీ దర్శకుడి స్థాయి నుంచి వైసీపీ పేటియం బ్యాచ్ స్థాయికి దిగజారారు ఆర్జీవీ. వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారుడిగా ప్రతిపక్ష నాయకుల మీద దిగజారిన పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందే ఆర్జీవీ కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ఈ గ్యాప్ తానూ తీసుకున్నాడో లేక వచ్చిందో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాలి. ఇలా ఇప్పటికే వాగిన ప్రతి వైసీపీ నోరు దానికదే మూసుకుంటుంది. అయితే ఇంకా మూపించాల్సిన నోర్లు, తేల్చాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయంటున్నారు కూటమి పార్టీల నేతలు.




