వైసీపిలో అందరూ ఆణిముత్యాలే… జగన్‌ చెపుతున్నారుగా!

AP CM YS Jagan

జగన్‌పై రాయి దాడి జరిగితే చంద్రబాబు నాయుడే ఈ హత్యకు కుట్రపన్నారని వైసీపి, వారి మీడియా కోడై కూసింది. అసలు రాయి తగలగానే ఇంత త్వరగా కనిపెట్టి చెప్పేయడం చాలా గొప్ప విషయం. కనుక సీబీఐ, ఎన్ఐఏ, రా, సీఐడీ, ఇంటలిజన్స్ తదితర దర్యాప్తు సంస్థలన్నీ వైసీపి వద్ద శిక్షణ తీసుకోవడం చాలా అవసరమనిపిస్తుంది.

కానీ జగన్‌పై ఎవరు రాయి దాడి చేయించారో వైసీపి తేల్చి చెప్పేసినప్పటికీ, పోలీసులు నలుగురు మైనర్ బాలురను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తుండటం దేనికో అర్దం కాదు!

ADVERTISEMENT

ఆనాడు కోడికత్తి కేసులో కూడా పెద్ద రాజకీయ కుట్ర ఉందని జగన్‌ తరపు న్యాయవాది ఎంత మొత్తుకొన్నా కోర్టు నమ్మలేదు. బహుశః ఈ కధ కూడా అలాగే ముగుస్తుందేమో?విచిత్రమేమిటంటే, వారి భవిష్యత్‌ కూడా ఈ ఎన్నికల ఫలితాలతోనే ముడిపడి ఉంది. వారి అదృష్టం బాగుంటే టిడిపి, జనసేన, బీజేపీల గెలిచి అధికారంలోకి వస్తే వెంటనే విముక్తి లభిస్తుంది. లేకుంటే మరో కోడికత్తి కేసులా మారి జైలులో మగ్గవలసి రావచ్చు.

రాజీవ్ గాంధీని దారుణంగా చంపిన హంతకులను సోనియా గాంధీ కుటుంబం క్షమించింది కానీ నా బీసీలు, నా ఎస్సీలు అంటూ దీర్గాలు తీసే జగన్‌ మాత్రం కోడికత్తి కేసులో శ్రీనుని క్షమించకలేకపోయారు. ఇది అప్రస్తుతం.

జగన్‌పై దాడి విషయంలో వైసీపి స్పందనను అర్దం చేసుకోవచ్చు. కానీ దళితులకు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష విధింపబడిన తోట త్రిమూర్తులు విషయంలో, అలాగే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి విషయంలో మాత్రం వైసీపి మరో ఆలోచన చేయడం లేదు.

కడప నుంచి అవినాష్ రెడ్డి, మండపేట నుంచి తోట త్రిమూర్తులను మార్చే ఆలోచన చేయడం లేదు. అయినా జైలుకి వెళ్ళివచ్చారనో లేదా జైలుకి వెళతారనో, లేదా గంట, అరగంట కేసుల కోసమో అభ్యర్ధులను మార్చుకుంటూ పోతే వైసీపిలో జగన్, విజయసాయి రెడ్డి కూడా పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.

వైసీపిలో టాప్ టూ బాటమ్ అందరూ ఆణిముత్యాలే… సౌమ్యులే! అని జగన్మోహన్‌ రెడ్డి స్వయంగా సర్టిఫై చేస్తున్నారు. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు కనుక ఎవరినో నిందించడం దేనికి?

ADVERTISEMENT
Latest Stories