Ex CM Jagan Tweet About Swami Vivekananda

వివేకానంద గురించి జగన్‌ ట్వీట్ అంటే గొడ్డలి పోటుకి బలైపోయి దండ వేయించుకుంటున్న బాబాయ్ వివేకానంద రెడ్డి గురించి కాదు.

ఈరోజు స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా జగన్‌ ట్వీట్ చేశారు. “లేవండి.. మేల్కొండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి” అన్న స్వామి వివేకానంద గారి ప్రేరణాత్మక పిలుపు నేటికీ యువతకు స్ఫూర్తిదాయకం. నేడు స్వామి వివేకానంద గారి జ‌యంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తూ యువ‌తీ యువ‌కులంద‌రికీ జాతీయ యువ‌జ‌న దినోత్స‌వ శుభాకాంక్ష‌లు,” అని జగన్‌ ట్వీట్ చేశారు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

జగన్‌ అధికారంలోకి రాక మునుపే ఆక్రమస్థుల స్టోరీ నడిపించి జైలుకి వెళ్ళి వచ్చారు… అని తెలిసి ఉన్నప్పటికీ ప్రజలు ఆయన మాటలు నమ్మి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే ఆయన ఏం చేశారో అందరూ కళ్ళారా చూశారు.. చెవులారా విన్నారు.

ఒకప్పుడు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఓ స్థాయి వరకే నష్టం జరిగేది. కానీ జగన్‌ హయంలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ తప్పించుకోలేకపోయారు. చెత్త పన్ను చెల్లించాల్సి రావడం ఇందుకు ఓ చిన్న ఉదాహరణ.

Also Read – తగలబడినవి ఆ దస్త్రాలేనా?

అవినీతి పనులు చేసేవారు గుళ్ళు గోపురాలకు వెళ్ళి వస్తుంటారు. వృద్ద తల్లి తండ్రులను హింసించే పిల్లలు, భార్యలని హింసించే భర్తలు కూడా గుళ్ళూ గోపురాలకు వెళుతుంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటుంటారు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు చేసేవారు సైతం ఏదో ఓ దేవుడికి మొక్కుతూనే ఉంటారు.

కానీ అంత మాత్రాన్న వారిలో మార్పు వచ్చేయదు. మంచివారిగా మారిపోరు. వారి ఆలోచనలు, గుణాలు అన్నీ యధాతధంగానే ఉంటాయి. అందుకే పుట్టుకతో వచ్చిన బుద్దులు పుడకలతో గానీ పోవని పెద్దలు ఎప్పుడో చెప్పారు.

Also Read – దేశంలో ఇక బీజేపి ఒక్కటే… అడ్డేలే!

కనుక తల్లిని, చెల్లిని గెంటేసి, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని, రాజధానిని, ప్రాజెక్టులను, వ్యవస్థలను, వాటిలో అధికారులను భ్రష్టు పట్టించేసిన జగన్‌ కూడా స్వామీ వివేకానంద సూక్తులు వల్లె వేయడం చాలా విడ్డూరంగా ఉన్నప్పటికీ సర్దుకు పోవలసిందే.




jagan-tweet