
అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వైసీపీ నేతలు ఇప్పుడు ఒకరొకరుగా మీడియా ముందుకు వచ్చి ‘ఆనాడు మేము అలా చేయడం తప్పే.. ఇలా చేయడం తప్పే..’ చెప్పుకోవడం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లే.
టీడీపీతో వైసీపీకి రాజకీయ విభేధాలు ఉంటే రాజకీయంగా తేల్చుకొని ఉండాలి. కానీ ఆ రాజకీయ కక్షతో అమరావతిని నాశనం చేసి రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు. సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పెంచేందుకు ఎడాపెడా అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. ఇప్పుడు ఆ భారం కూడా ప్రజలే మోయాల్సివస్తోంది కదా?
Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?
మహా కుంభమేళాకి వెళ్ళి గంగలో మునిగితే పాపాలన్నీ పోవచ్చు కానీ వైసీపీ చేసిన పాపాలు ఎన్నటికీ పోవు. వాటికి వారు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు.
అయితే మా పాపాలు ఇంకా చాలా ఉన్నాయంటూ ధర్మవరం మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మరో జాబితా బయటకు తీసి వినిపించి ‘ఆనాడు మేము ఆవిదంగా చేయడం తప్పే’ అని చెప్పుకున్నారు.
Also Read – కథ నచ్చితే ‘అమ్మ’ అయినా ‘అమ్మమ్మ’యినా ఒకే..
“మంగళగిరిలో టీడీపీ కార్యాలయంపై, చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ నేతలు దాడులు చేయడం ముమ్మాటికీ తప్పే. అలాగే తాడిపత్రిలో టి నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై మా చిన్నాన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడం కూడా తప్పే.
శాసనసభలో చంద్రబాబు నాయుడు అర్ధాంగిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా తప్పే. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఆవిదంగా అనుచితంగా మాట్లాడటం కూడా తప్పే. అప్పుడే మా అధిష్టానం (జగన్మోహన్ రెడ్డి) వాటిని అడ్డుకొని ఉంటే బాగుండేది. కనీసం ఖండించి ఉంటే బాగుండేది. కానీ రెండూ చేయలేదు.
Also Read – రాహుల్ “లీగల్లీ కన్వెర్టడ్ ఇండియన్”.?
పైగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి మరో తప్పు చేశారు. తద్వారా టీడీపీ, జనసేనలు కలిపేందుకు దోహదపడ్డారు. ఇటువంటి తప్పుల వల్లనే మా పార్టీ ఎన్నికలలో ఓడిపోగా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా సంయమనం పాటిస్తూ మా పార్టీ నేతలు చేస్తున్న తప్పులను తెలివిగా తమకు అనుకూలంగా మలుచుకొని ప్రజల సానుభూతి, మద్దతు పొంది ఎన్నికలలో ఘన విజయం సాధించారు,” అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు మా పార్టీ ఎందువల్ల ఓడిపోయిందో అర్దం కావడం లేదని నిన్ననే అన్నారు. అదే సమయంలో కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి వైసీపీ ఎందుకు ఓడిపోయిందో పూసగుచ్చిన్నట్లు ఇంత చక్కగా చెప్పారు.
వైసీపీ చాలా పాపాలు చేసిందని ఒప్పుకుంటున్నారు కనుక వైసీపీ హయంలో ఆరాచకాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. నిజానికి వైసీపీ పాపాలకు లెక్కలు కట్టి చర్యలు తీసుకోవడానికి ట్రిబ్యునల్ కూడా సరిపోదు.. దీని కోసమే ప్రత్యేకంగా ఓ మంత్రిని నియమించుకొని బాధ్యతలు అప్పగిస్తే బాగుండేది.