brs-ktr-supreme-court Dismisses Quash Petition

ఎఫ్-1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్‌కి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది.

ఆయన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేయడంతో ఆయన జనవరి 8న సుప్రీంకోర్టులో మరో క్వాష్ పిటిషన్‌ వేశారు. ఈరోజు దానిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోలేమంటూ పిటిషన్‌ కొట్టేశారు.

Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!

ఈ కేసుని కేటీఆర్‌ ఓ పనికిమాలిన ‘లొట్టిపీసు కేసు’ అని ఎంత తేలికగా కొట్టివేస్తున్నప్పటికీ ఈ కేసులో నిబంధనలకు విరుద్దంగా జరిగిన ఆర్ధిక లావాదేవీలు ‘ఆర్ధిక నేరం’గా పరిగణింపబడతాయి. అందువల్లే ఈడీ జోక్యం చేసుకొని మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ఆర్ధిక నేరం ఉంది కనుకనే కేటీఆర్‌ వేసిన క్వాష్ పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. పైగా సుప్రీంకోర్టు కూడా కేటీఆర్‌కి ముందస్తు బెయిల్‌ కూడా మంజూరు చేయలేదు.

Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!


కేటీఆర్‌ రేపు (గురువారం) ఈడీ విచారణకు హాజరు కావలసి ఉంది. కనుక కేటీఆర్‌ చాలా పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లే భావించవచ్చు.