2 వేల రూపాయల నకిలీ ముఠా గుట్టురట్టు!

fake-2000-rupees-notes-telanganaదేశంలో ఇంకా చాలా మందికి దగ్గరికి వెళ్ళకముందే, నకిలీ 2000 రూపాయల నోట్ల ఉదంతం సంచలనమైంది. అత్యాధునికమైన సెక్యూరిటీతో ఫేక్ కరెన్సీ సృష్టించడానికి అనువుగా లేదంటూ ఆర్బీఐ అధికారులు విడుదల చేసిన 48 గంటల్లోనే ఈ ఫేక్ కరెన్సీ వార్తలు మీడియా వర్గాలు ప్రసారమయ్యాయి. దీంతో ఇప్పటికే చెల్లుబాటు కాని 500, 1000 నోట్లకు తోడు ఫేక్ 2 వేలు ఏంటా? అని తలలు పట్టుకోవడం సామాన్యుల వంతయ్యింది. అయితే ఇందులో ఒక సంఘటన తెలంగాణాలోని, మహబూబాబాద్ జిల్లా, కురవిలో నమోదు కావడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితులను అరెస్ట్ చేసారు.

కురవిలోని వీరభద్రస్వామి ఆలయ సమీపంలో గల పెట్రోల్ బంక్ నందు పెట్రోల్ కొట్టించుకుని, 2 వేల రూపాయల నోటు ఇవ్వగా, అది నకిలీదిగా తేలడంతో, అతన్ని పట్టుకునే లోపునే బైక్ పైన పరారయ్యాడు. అయితే ఈ సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులు కురవి మండలానికి చెందిన వారుగా గుర్తించి విచారణ చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న భానోత్ ప్రదీప్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

ADVERTISEMENT

తన స్నేహితుడు ప్రమోద్ అనే వ్యక్తికి జిరాక్స్ సెంటర్ ఉండడంతో, రెండు వేల రూపాయల నోటు నాలుగు కలర్ జిరాక్స్ లను తీయించి చెలామణి చేసేందుకు ప్రయత్నించినట్లుగా ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఉదంతంలో నిందితులు కేవలం జిరాక్స్ లనే నమ్ముకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే మరో పెద్ద పెనుబాంబే దేశ ప్రజల గుండెల్లో పడి ఉండేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా!

ADVERTISEMENT
Latest Stories