ఐదేళ్ళు నిర్లక్ష్యం.. మూడేళ్ళలో అమరావతి ప్రత్యక్షం!

Amaravati will be Visible in 3 Years

మూడు రాజధానులు, విశాఖ రాజధాని అంటూ జగన్‌ ఎన్ని స్టోరీలు చెప్పినా 5 ఏళ్ళు అమరావతిలో కూర్చునే రాష్ట్రాన్ని పాలించారు. అమరావతి అంటే అది చంద్రబాబు నాయుడు ఆస్తి అన్నట్లు భావించిన జగన్‌, ఆయనపై ద్వేషంతో దాని నామరూపాలు కూడా కనబడకుండా నాశనం చేసేయాలని చేయకూడని పనులన్నీ చేశారు.

కానీ అమరావతి వేరే దేశంలోనో వేరే రాష్ట్రంలోనో లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భాగమే అని జగన్‌ భావించలేదు. అందువల్లే అమరావతి పట్ల, దాని కోసం తమ జీవనోపాధినిచ్చే భూములు ఇచ్చిన రైతులతో జగన్‌ అంత నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. జగన్‌ వలన రాజధానికి మాత్రమే నష్టం కలుగలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది.

ADVERTISEMENT

ఏదైనా సమస్య కోసం ఆందోళన చేసే ప్రజలు ఆర్టీసీ బస్సు మీద ఓ రాయి విసిరితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారు. కానీ జగన్‌ అదృష్టమేమిటంటే రాష్ట్రానికి, రాజధానికి ఇంత నష్టం చేసినా ఆయనకి ఎటువంటి శిక్ష పడదు!

ఆయన చేసిన తప్పులకి ఎవరికీ జవాబు చెప్పుకోనవసరం కూడా లేదు! పైగా వాటికి కూడా రాష్ట్ర ప్రజలే మూల్యం చెల్లించాలి. నాడు వంద కోట్లతో నిర్మించగల ఓ భవనం, 5 ఏళ్ళు పక్కన పడేయడం వలన ఇప్పుడు రూ.500 కోట్లు ఖర్చుతో నిర్మించాల్సి వస్తే ఆ అదనపు భారం ఎవరు భరించాలి? జగన్‌? ప్రజలా? ప్రజలు ఎందుకు భరించాలి?

రాష్ట్ర రాజధాని అంటే రోడ్లు, ఫ్లై ఓవర్లు, డ్రైనేజ్, విద్యుత్, తాగు నీరు, రవాణా వంటి సకల సదుపాయాలు ఉండాలి. పోలీస్ ప్రధాన కార్యాలయం, సచివాలయం, హైకోర్టు, రిజర్వ్ బ్యాంక్, సీబీఐ వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి.

హైదరాబాద్‌ రాజధానిగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ క్రమంగా ఏర్పాటయ్యాయి. కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి ప్లాన్డ్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నారు. కనుక వీటన్నిటితో అమరావతి ఒకేసారి కళ్ళ ముందు సాక్షాత్కరించబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అదృష్టంగానే భావించాలి.

ప్రధాని మోడీ వచ్చి పునః ప్రారంభించి అమరావతి నిర్మాణానికి అన్ని విదాల సాయపడతానని హామీ ఇచ్చి వెళ్ళారు. అమరావతి పనులు పూర్తిచేయడానికి సిఎం చంద్రబాబు నాయుడు మూడేళ్ళు గడువు విధించారు. కనుక ఇక యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభం అవుతున్నయి.

నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తుళ్ళూరులో రాష్ట్ర స్థాయిలో అతిపెద్ద ఫోరెన్సిక్ ప్రయోగశాల భవన సముదాయాల నిర్మాణం చేపట్టారు.

నేర నిరూపణలో క్లూస్ టీమ్‌ సేకరించిన సాక్ష్యాధారాలను శాస్త్రీయ పద్దతులలో విశ్లేషించి ఫోరెన్సిక్ ప్రయోగశాల ఇచ్చే నివేదికలు చాలా కీలకమైనవి. అటువంటి విభాగాన్ని కూడా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ భవన సముదాయం 5 ఏళ్ళు అలాగే ఉండి పోయింది.

చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాని నిర్మాణ పనులు మొదలయ్యాయి. రూ.250 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ప్రయోగశాల వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి వస్తుందని డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories