వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన “ప్రజా సంకల్పయాత్ర”లో చోటు చేసుకుంటున్న వింతలకు, ఆశ్చర్యాలకు కొదవలేకుండా పోతోంది. జగనన్న రాక కోసం ఒకటి, రెండేళ్ళ పసి బాలుడు కూడా వేచిచూడడం… మూడు, నాలుగేళ్ల పాప నిరాహార దీక్ష చేయడం… 40 ఏళ్ళ మహిళ ముసలి అవ్వ అయిపోవడం… ఇలా చెప్పుకుంటూ పోతే ఓ మహాభారతమే అవుతుంది. అయితే ఇలాంటి వింతలకు ఇప్పట్లో శుభంకార్డు పడేలా కనపడడం లేదు.
తాజాగా అయితే… పట్టుమని పది నిముషాలు కూడా నిలబడలేని వికలాంగుడు ఏకంగా 12 కిలోమీటర్లు జగన్ వెంట నడిచి, తన ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అదేంటి ఈ వార్త ఎక్కడా వినలేదని అనుకుంటున్నారా..! జగన్ మీడియాలో ఇలాంటి వింత వార్తలు సందర్శిస్తుంటాయి కదా..! అందులో భాగంగా వెలువడిన క్రమంలో… ఓ నడుము విరిగిపోయిన వ్యక్తి, గత పదేళ్లుగా మంచానికి పరిమితం అయ్యాడట.
కనీసం పది నిముషాలు కూడా సదరు వ్యక్తి నిలబడలేడట. కానీ జగన్ పాదయాత్ర చేస్తుంటే తట్టుకోలేని సదరు వ్యక్తి ఒక్కసారిగా నిల్చోవడమే కాదు, ఏకంగా జగన్ తో కలిసి 12 కిలోమీటర్లు నడవగలిగాడు. నమ్మలేకపోతున్నారా..! డాక్టర్లు, దేవుళ్ళు కూడా సాధించలేని ఇలాంటి వింతలకు నిలయంగా జగన్ “ప్రజా సంకల్పయాత్ర” నిలుస్తోంది మరి! అయితే ఇది ఇక్కడితో ఆగేది కాదు… మరో నాలుగైదు నెలల పాటు ఇలాంటి వింతలు, విడ్డూర్యాలు విని తరించాల్సిందే.



